సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు ‘యశ్ చోప్రా’ 4 వ జాతీయ అవార్డు

photoసుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు ‘యశ్ చోప్రా’ 4 వ జాతీయ అవార్డు ను ఇవ్వ నున్నట్లు టి.ఎస్.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షులు డా. టి. సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటన లో పేర్కొన్నారు. పమేలా చోప్రా (దివంగత యశ్ చోప్రా సతీమణి), పద్మిని కొల్హాపురి, బోనీకపూర్ లతో కూడిన సభ్యుల కమిటీ ఈ ఏడాది యశ్ చోప్రా 4 వ జాతీయ అవార్డు కు గాను సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ను ఎంపిక చేసింది.
యశ్ చోప్రా మరణం తరువాత ఆయన పేరిట ఈ జాతీయ అవార్డు ను డా. టి. సుబ్బరామిరెడ్డి ‘టి.ఎస్.ఆర్. ఫౌండేషన్’ పేరు పై ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ అవార్డు పేరిట 10 లక్షల రూపాయల నగదు, బంగారు పతాకం, ప్రసంశా పత్రం ను అవార్డు గ్రహీత కు అందించ నున్నారు. 2017 ఫిబ్రవరి 25 న ముంబై లోని హోటల్ మారియట్ లో జరిజరిగే వేడుకలో ఈ యశ్ చోప్రా’ 4 వ జాతీయ అవార్డు ను సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు అందించ నున్నట్లు డా. టి. సుబ్బరామి రెడ్డి తెలిపారు.
గతం లో ఈ అవార్డు ను సుప్రసిద్ధ బాలీవుడ్ గాయని లత మంగేష్కర్, నటులు అమితాబ్ బచ్చన్, రేఖ లు అందుకున్నారు.

అమితాబ్ బచ్చన్, రేఖ, శ్రీదేవి, రాణి ముఖర్జీ, ఐశ్వర్య రాయ్, జయప్రద, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు ఇతర సినీ నటులు ఈ అవార్డు వేడుకలో పాల్గొన నున్నారు
To Top

Send this to a friend