సుచిత్ర.. బతికుందా..? లేదా..?


సుచీలీక్స్ పేరిట తమిళనాట రిలీజైన బూతు, రోమాన్స్ వీడియోలు, ఫొటోలు కోలీవుడ్ లో ఎన్ని ప్రకంపనలు సృష్టించాయో మనకు తెలిసిందే.. కోలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ పర్సనల్ ఫొటోలు, సెక్స్ వీడియోలు సంచలనం సృష్టించాయి. రజినీకాంత్ అల్లుడు ధనుష్ ఇమేజ్ ఈ ఫొటోలతో చాలా డ్యామేజ్ అయ్యింది..అయితే ఈ లీక్ లకు పాల్పడ్డ గాయని సుచిత్ర మానసిక పరిస్థితి బాగా లేదని ఆమె భర్త కార్తీక్ ప్రకటించాడు. నన్ను హీరో ధనుష్, సంగీత దర్శకుడు అనిరుధ్ రేప్ చేశారని కూడా గాయని ఆరోపించింది. దీంతో ఆమె వైవాహిక జీవితానికి సైతం బీటలు వారింది..

అయితే కొన్ని వారాలుగా ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఆ వీడియోలు , సుచీ ట్విట్టర్ ఖాతా రద్దయిపోయింది. దీంతో అక్కడికే ఈ వివాదం ముగిసినట్టేనని కోలీవుడ్ లో అంతా భావించారు. ఆమె విదేశాలకు వెళ్లిందని ప్రచారం చేశారు. కానీ ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

సింగర్ సుచిత్రను కిడ్నాప్ చేశారన్న వార్తలు కోలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. కోలీవుడ్ లోని కొందరు పెద్దలే ఆమెను కిడ్నాప్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో ధనుష్, అనిరుధ్ ఆండ్రియా, చిన్మయి, హన్సిక, త్రిష వంటి అగ్రనటీనటుల ప్రైవేటు ఫొటోలను పెట్టి వారిని సుచిత్ర బజారుకీడ్చింది. ఆ మంటతోనే రగులుతున్న కొందరు గ్రూపుగా ఏర్పడి ఆమెను కిడ్నాప్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బాత్రూమ్ లో స్నానం చేస్తున్న ఓ నటి ఫొటోలను సుచీలీక్స్ లో పెట్టరన్న కథనాలు తమిళనాడులో విస్తృతంగా వ్యాపించాయి. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు దారి తీస్తుందోనని ఇండస్ట్రీ గుబులు పడుతోంది.

అయితే సుచిత్ర ఎక్కడుంది.? ఆమె ఏం చేస్తుంది. అసలు బతికి ఉందా లేదా అన్న విషయంపై అటు మీడియాకానీ, పోలీసులు కానీ పట్టించుకోకపోవడం గమనార్హం.

To Top

Send this to a friend