సీ మై రీల్స్ యాప్ లాంచ్‌

సినిమాల్లో అవ‌కాశం ఎదురుచూస్తున్న యువ‌తీ యువ‌కుల కోసం శ్రీక‌ర ఐటీ సర్వీసెస్ సంస్థ గ‌త మూడు సంవత్స‌రాలుగా సీ మై రీల్స్ అనే ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఉచిత సేవ‌లందిస్తోంది. యూజ‌ర్స్‌కు మెరుగైన సేవ‌లందించ‌డానికి సీ మై రీల్స్ అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఇందులో హీరో నిఖిల్‌, క‌ల్యాణ్ కృష్ణ‌, కాదంబ‌రి కిర‌ణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యాప్‌ను హీరో నిఖిల్ విడుద‌ల చేయ‌గా, షార్ట్ ఫిలిం ఫెస్ట్ పోస్ట‌ర్‌ను క‌ల్యాణ్ కృష్ణ విడుద‌ల చేయ‌గా, ట్రైల‌ర్‌ను కాదంబ‌రి కిర‌ణ్ కుమార్ విడుద‌ల చేశారు. అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో….

కాదంబ‌రి కిర‌ణ్ కుమార్ మాట్లాడుతూ “కొత్త న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌ను ప్ర‌మోట్ చేయాల‌నే ఉద్దేశంతో కొత్త అప్లికేష‌న్‌ను ప్రారంభించిన సీ మై రీల్స్ సంస్థ‌ను అభినందిస్తున్నాను. ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ప్ర‌మోష‌న‌ల్ డైరెక్ట‌ర్ ర‌వి మాట్లాడుతూ “సినిమాల‌పై ప్యాష‌న్‌తో ఓ టీంగా ఏర్ప‌డి సాఫ్ట్‌వేర్‌ను ఎక్క‌డ నుండో కోనుగోలు చేయ‌కుండా మాకు మేముగా ఓ సాఫ్ట్‌వేర్‌ను క్రియేట్ చేశాం. కొత్త‌వారిని ఎంక‌రేజ్ చేయ‌డానికి, మా యాప్‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి ఓ షార్ట్ ఫిలిం ఫెస్టివ‌ల్‌ను ఏర్పాటు చేసి అందులో గెలిచిన వారికి బ‌హుమ‌తులను అందిస్తున్నాం. దీని వ‌ల్ల యంగ్ టాలెంట్‌ను కొత్త మార్గం దొరికినట్ట‌వుతుందే త‌ప్ప‌ క‌మ‌ర్షియ‌ల్ ఆలోచ‌న‌తో చేయ‌లేదు. మా వెనుక నిల‌బ‌డి ప్రోత్స‌హించిన గంగాధ‌ర్ అన్న‌య్య స‌హా అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.

గంగాధ‌ర్ మాట్లాడుతూ “యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే ఉద్దేశంతో ఈ యాప్‌ను డెవ‌ల‌ప్ చేశాం. స‌పోర్ట్ చేసిన నిఖిల్‌, క‌ల్యాణ్ కృష్ణ‌, కాదంబ‌రి కిర‌ణ్‌ల‌కు థాంక్స్‌. ఈ సంస్థ మ‌రింత ఉన్నత స్థాయికి చేరుకోవాల‌ని ఆశిస్తు్న్నాను“ అన్నారు.

క‌ల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ “క్రియేటివిటీకి సంబంధించిన సినిమా రంగంలో ఉన్న‌వారందరూ ధైర్య‌వంతులేన‌ని న‌మ్ముతాను. ఎందుకంటే కేవలం క‌ష్టాన్ని, అదృష్టాన్ని న‌మ్ముకుని ప‌ని చేయాల్సి ఉంటుంది. అలాంటి యంగ్ టాలెంట్ ఉన్న‌వారికి ఈ సంస్థ ప్ర‌వేశ పెట్టిన యాప్ ఓ బ్రిడ్జ్‌లా ఉపయోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నాను“ అన్నారు.

నిఖిల్ మాట్లాడుతూ “శ్రీక‌ర సంస్థ ఆలోచ‌న చాలా కొత్త‌గా ఉంది. ఇప్పుడు చూడ‌టానికి సాధార‌ణంగా ఉంది కానీ భ‌విష్య‌త్‌లో చాలా పెద్దగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచ‌న‌ను వేరే ఇండస్ట్రీవాళ్లు కూడా కాపీ కొట్టే అవ‌కాశం ఉంది. ఈ యాప్ చాలా మంది యంగ్ టాలెంట్ ఉన్న వ్య‌క్తుల‌కు హ్యాపీడేస్‌ను తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

To Top

Send this to a friend