సీఎం పీఠమెక్కేవేళ.. శశికళకు అనుకోని షాక్

పాపం శశికళ.. తన సీఎం వాంచ తీరకుండానే జైలుకు పోయేలా ఉంది.. అష్టకష్టాలు పడి ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంను బుజ్జగించి ఎమ్మెల్యేలను లైన్లోకి తెచ్చి.. సీఎం పీఠంపై కూర్చునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వేళ.. శశికళకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.. మరో వారం రోజుల్లో జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడిస్తున్నట్టు పేర్కొంది..

జయ అక్రమాస్తుల కేసులో శశికళ సహ నిందితురాలిగా ఉన్నారు. గతంలో 2014లో జయ, శశికళను దోషిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.. కొంత కాలం పన్నీర్ సెల్వంను సీఎంను చేసి జయ జైలు శిక్ష అనుభవించి వచ్చారు. ఆ తర్వాత 2015లో కర్ణాటక హైకోర్టే జయ కేసును కొట్టివేసింది. ఆ సమయంలో జయ ఎన్నికల్లో గెలిచి మళ్లీ సీఎం పీఠమెక్కారు.

మళ్లీ సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత గెలవడం మరోసారి సీఎం కావడం జరిగిపోయాయి. కానీ కర్ణాటక ప్రభుత్వం జయ అక్రమాస్తుల కేసును సుప్రీం కోర్టులో సవాలు చేసింది.. ఇప్పుడు ఆ కేసు తుది తీర్పును మరో వారం రోజుల్లో వెలువరుస్తానని సుప్రీం చెప్పింది.. జయ మృతిచెందగా సహ నిందితురాలుగా ఉన్న శశికళకు ఇప్పుడు ఈ కేసు వెంటాడుతోంది. సుప్రీం శిక్ష ఖరారు చేస్తే శశికళ జైలు కెళ్లడం ఖాయం.. దీంతో తమిళనాడు సీఎంగా ఎన్నికవుదామనుకున్న ఆమె ఆశలు అడియాశలు కానున్నాయి. ఈ తీర్పు నేపథ్యంలో ఒకవేళ సీఎంగా పీఠమెక్కినా.. తరువాత దిగిపోవాల్సిందే… అందుకే మరో వారం రోజుల పాటు ఉత్కంఠ తప్పదు

To Top

Send this to a friend