సీఎం తల తెస్తే ఆస్తి మొత్తం ఇచ్చేస్తా..

మధ్యప్రదేశ్ కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రవాత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేరళలో బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను ఎదగనీయకుండా చేస్తున్న సీపీఎం నేత, కేరళ ముఖ్యమంత్రి విజయన్ ను ఎవరైనా చంపినా.. ఆయ తల నరికి తెచ్చిన మొత్తం ఆస్తినంతా ఇచ్చేస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఉజ్జయినిలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. కేరళలో చాలా కాలంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు, అక్కడి సీపీఎం పార్టీ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేధాలున్నాయని.. వాటితోనే బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను విజయన్ అణిచివేస్తున్నాడని ఆర్ఎస్ఎస్ నేత ఆరోపించారు.

కేరళ సీఎంగా విజయన్ అధికారం చేపట్టినప్పటి నుంచి బీజేపీ నాయకుడు సంతోష్ తో సహా మొత్తం ఎనిమిది మంది బీజేపీ నాయకులు హత్యకు గురయ్యారు. దేశాన్ని చీల్చేందుకు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కుట్రపన్నుతాయని కేరళ సీఎం విజయన్ బహిరంగంగా సవాల్ చేస్తూ అక్కడి హిందుత్వ పార్టీలను అణిచివేస్తున్నారు. దీంతో ఆయన ప్రతికారం తీర్చుకుంటామని ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రవాత్ ప్రకటించారు. ఇప్పుడు కేరళ సీఎం తల తెస్తే ఆస్తినిస్తానని ప్రకటించాడు.

To Top

Send this to a friend