సీఎంనే తీసేశారు.. తండ్రి కొడుకులు విడిపోయారు..

up_mulayam-singh-yadav-akhilesh

వెనుకటికి రెండు కుక్కలు బొక్క కోసం కొట్లాడుకుంటే మధ్యలో వచ్చిన కోతి దాన్ని ఎత్తుకుపోయిందన్న చందంగా మారింది యూపీలో రాజకీయాల పరిస్థితి. అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో సీఎం అఖిలేఖ్ , పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ తండ్రి ములాయం మధ్య విభేదాలు వచ్చాయి. కొడుకు సీఎం సూచించన ఎమ్మెల్యే పేర్లను తండ్రి పక్కనపెట్టడం విభేదాలకు కారణం.. దీంతో అఖిలేష్ తండ్రి కేటాయించిన సీట్లకు విరుద్ధంగా వంద మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించారు. దీంతో కోపోద్రిక్తుడైన పార్టీ అధ్యక్షుడు ములాయం అఖిలేష్ ను సస్పెండ్ చేశారు. కొత్త సీఎం ఎన్నికకు రేపు పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో సీఎం అఖిలేష్ కూడా తన మద్దతుదారులతో సమావేశమై తండ్రితో పోరుకు సై అన్నారు. ఈ పరిణామాలు యూపీలో అస్థిరతకు దారితీశాయి.
కాగా యూపీలో ఈ పరిణామాలు మరోసారి గతితప్పడంతో సమాజ్ వాదీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటమికి దారి తీసే అవకాశాలున్నాయని ములాయం సన్నిహితులైన లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ లు యోచిస్తున్నారు. అందుకే వారు రంగంలోకి దిగి ములాయం, కొడుకు సీఎంతో సయోధ్యకు యత్నిస్తున్నారు. మీరిద్దరు కొట్లాడుకుంటే బీజేపీ లాభపడుతుందని.. కలిసిపోయి మరోసారి ఎన్నికల బరిలోకి దిగాలని కోరుతున్నారు.

To Top

Send this to a friend