సినీ పరిశ్రమలో మరో విషాదం..

ompuri-ankuram-apnewsonline

సినీ పరిశ్రమల దిగ్గజ నటుల అస్తమయం జరుగుతూనే ఉంది.. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో మంది మంచి నటులు, కామెడీ లో జీవించగల నటులను కోల్పోయింది. ఆ విషాదం మరువక ముందే. బాలీవుడ్ సీనియర్ నటుడు.. నట శిఖరం ఓం పురి (66) కన్నుమూశారు. ముంబై లోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
హిందీ సినిమాలతో పాపులర్ అయిన ఓంపురి పలు ప్రాంతీయ భాషా చలన చిత్రాల్లో నటించారు.. తెలుగులో అంకురం సినిమాలో ఆయన నటనని ఎవరూ మరచిపోలేరు… కన్నడ, పంజాబీ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాల్లో కూడా ఓం పురి నటించారు.. ఇటీవల భారత ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అనతరం భారత్ ఆర్మీకి క్షమాపణ చెప్పిన సంగతి విధితమే… కాగా ఓం పురి మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భాంత్రిని వ్యక్తం చేసింది.. అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ నటులు ఓం పురి మరణం షాక్ కు గురి చేసిందని పేర్కొన్నారు

To Top

Send this to a friend