సిద్దూ మేనియా: కాంగ్రెస్ దే పంజాబ్


పదేళ్ల అకాలీదళ్-బీజేపీ పాలనను పంజాబ్ ప్రజలు బండకేసి కొట్టారు. ఎన్నికల ముందు జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాలతో క్రికెటర్, ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్దూ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకొని పంజాబ్ అంతటా కలియతిరిగారు. దీంతో అకాలీదళ్ కోటను బద్దలు కొట్టి పంజాబ్ అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. సిద్దూ నేతృత్వంలో పంజాబ్ బరిలో దిగిన కాంగ్రెస్ ను జనం ఆదరించారు. మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 117 స్థానాలకు గాను కాంగ్రెస్ 69 స్థానాల్లో ఆధిక్యం సాధించి అధికారం దిశగా దూసుకుపోతోంది.. అకాలీదళ్-బీజేపీ కూటమి 18 స్థానాల్లో ముందజలో ఉండి ఓటమి దిశగా సాగుతోంది. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ఎన్నో ఆశలతో పంజాబ్ బరిలో దిగినా నిరాశే ఎదురైంది.. కానీ అధికార అకాళీ దల్ కంటే ఒక్క స్థానం ఎక్కువగా 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తుది ఫలితాలు సాయంత్రం వరకు వెలువడనున్నాయి. మొత్తం సంపూర్ణ ఆధిక్యం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే దిశగా సాగుతోంది.

To Top

Send this to a friend