సాహో శాతకర్ణి.. ఆకాశానికెత్తేసిన రాజమౌళి..

జక్కన్న రాజమౌళి బాలక్రిష్ణ వందో చిత్రాన్ని ఆకాశానికెత్తేశారు.. సినిమా ఈరోజు ఉదయం బాలక్రిష్ణతో కలిసి చూసిన రాజమౌళి చిత్రం యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘శాతకర్ణి అద్బుత కావ్యంలా ఉందని తెలిపారు. ఈ సినిమాను 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని రాజమౌళి అన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత దర్శకుడు రాజమౌళి క్రిష్ నుంచి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 12 కోట్ల మంది తెలుగువారితోపాటు దేశం గర్వపడే శాతకర్ణి చిత్రాన్ని తీసిన క్రిష్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. తెలుగు చిత్రాల్లోనే గౌతమిపుత్ర శాతకర్ణి అజరామరం అని రాజమౌళి కీర్తించారు.

రాజమౌళి ట్విట్టర్ వ్యాఖ్యలను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend