సాయిరామ్ శంకర్ హీరోగా “నేనోరకం”

apnewsonlinin-neenorakam

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్దమయింది.కాగా రాక్ స్టార్  దేవిశ్రీ ప్రసాద్ నేనోరకం సాంగ్ టీజర్ ను ఈ రోజు లాంఛ్  చేశారు. త్వరలో ఈ సినిమా  పాటలను విడుదల చెయనున్నారు..

ఈసందర్బంగా ..
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. నేనోరకం టీజర్,  సాంగ్స్ ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి. చిత్ర యూనిట్ కు నా అభినందనలు. సాయి రామ్ శంకర్ కెరీర్ లో “నేనోరకం ” బెస్ట్ మూవీ అవుతుందన్నారు..

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. నేనోరకం సాంగ్ టీజర్ ను దేవిశ్రీ ప్రసాద్ లాంఛ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. కాంటెపరరీ ఇష్యూస్ ను స్పూర్తిగా తీసుకొని , ఇంట్రెస్టింగ్ కంటెంట్తో  థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా  ఈ సినిమా తెరకెక్కించబడిందన్నారు..

దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ.. నేనోరకం సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే  సరికొత్త ట్రీట్ మెంట్ తో రూపొందించటం జరిగింది. ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను అందించే చిత్రమిదని అన్నారు.

నిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ…  ఈ నెలలొనె పాటలను విడుదల చెయనున్నాము.అన్ని వర్గాల వారిని అలరించెలా ఈ సినిమా ను  సిద్దం చేయటం జరిగింది. రాధిక శరత్ కుమార్ గారు తమిళ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెసెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్ర విజయంపై 100% కాన్ఫిడెన్స్ తో ఉన్నామన్నారు..

రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ , ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు
కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్.

To Top

Send this to a friend