సామాన్యుల సొమ్ముతో ఆటలు..

ఇవాళ.. రేపు.. ఎంత పేదల చేతిలోనైనా లక్షలు తచ్చాడుతున్నాయి. కనీసం ఓ మూడు నాలుగు లక్షల రూపాయలైనా అటూ ఇటో చేసి ఏడాదిలో సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఆడబిడ్డ పెళ్లి కోసమో.. లేక కొడుకుల చదువుల కోసమో ఈ మొత్తాన్ని సంపాదిస్తున్నారు. వ్యవసాయం చేసో లేక మరేదైన వ్యాపారం ద్వారానైనా కూడబెట్టుకుంటున్నారు. ఇక గొర్రెలు, మేకల మందల వారు సంతల్లో అమ్ముతూ కనీసం 10 లక్షలు ఏడాదిలో సంపాదిస్తున్నారు. వీరంతా పేదలే.. రోజువారి కూలీలే.. అయితే పది లక్షలు సంపాదించడం అనేది ఇప్పుడు సర్వసాధారణ విషయం.. ఏడాదిలో ఎవ్వరు తలుచుకున్నా అది సంపాదించవచ్చు.. కానీ మోడీ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్ల ఇప్పుడు వీరి డబ్బుకు గ్యారెంటీ లేకుండా పోయింది. పేదల సొమ్ముపై ఐటీ నిఘా పెట్టి వాటిని స్తంభింపచేయడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవడం నిజంగా విస్తుగొలుపోతోంది..

బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు ఉంటే ఐటీ కన్ను పడుతుందట.. కేంద్ర ప్రభుత్వంలోని ఐటీ విభాగం తనిఖీలు చేస్తారట.. డిపాజిట్లు, క్రెడిట్ కార్డుల బిల్లులు, ఆస్తి లావాదేవీలు.. ఏవైనా సరే 10 లక్షలు మించితే ఐటీ అధికారులు నోటీసులిస్తారట.. ఇదీ మనం ఎన్నుకున్న మోడీ బీజేపీ ప్రభుత్వ ఘనత..

నిజంగా చెప్పాలంటే దేశాన్ని దోచుకుంటున్నది.. నల్లడబ్బు కూడబెడుతున్నది రాజకీయ నాయకులు.. బడా పారిశ్రామికవేత్తలే.. వాళ్లను వదిలేసి మోడీ ఏడాదికి 10 లక్షలు దాచుకునే పేదలు, మధ్యతరగతి వారిపై పడడం నిజంగా విడ్డూరంగా ఉంది.. చచ్చీ చెడీ సంపాదించిన సొమ్ముపై ఐటీతో నిఘా పెడుతున్న మోడీ.. కోట్లు కాజేసి.. ఎగ్గొట్టి విదేశాలకు చెక్కిన విజయ్ మాల్యా లాంటి వారిని వెనక్కి తీసుకువచ్చే సాహసం మాత్రం చేయడంలేదు.. మోడీ తీసుకుంటున్న ఈ అసంబద్ధ నిర్ణయాల వల్ల సామాన్యులు డబ్బుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. కోట్లు కాజేస్తున్న రాజకీయ నాయకులు, మాల్యా లాంటి పారిశ్రామిక వేత్తలు హాయిగా ఉంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. ‘‘నోట్ల రద్దుతో రాచిరంపాన పెడుతున్న మోడీని వచ్చే ఎన్నికల్లో 10 కి.మీల లోతులో బొందపెట్టడానికి రెడీ అవుతున్నామంటున్నారు సామాన్యులు.’’ సామాన్యుల మనసులో మెదులుతున్న ఆలోచన, ఆక్రోషం.. ఆవేదన ప్రస్తుతం ఇదే..

To Top

Send this to a friend