పెద్ద నోట్ల రద్దు తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది.. పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక రంగం కుదేలయిన వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రజలకు స్వాంతన చేకూరేలా పలు నిర్ణయాలను వెలువరించారు.. మధ్యతరగతికి ఊరట నిచ్చేలా ఆదాయ పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. 3 లక్షల నుంచి 6 లక్షల వరకు కేవలం 5శాతమే పన్ను విధించి సామాన్యులకు కేంద్రం ఉపశమయనం కలిగింది..ఇక రాజకీయ పార్టీలకు షాకిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి.. 20 వేల రూపాయల విరాళాలు దాటితే ఆ లెక్క చూపించాల్సిందేనని స్పష్టం చేశారు. విరాళాలను నగదు రూపంలో స్వీకరించవద్దని.. చెక్కు లేదా డిజిటల్ రూపంలో మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించి పార్టీలకు పెద్ద అఘాతం సృష్టించారు. ఇక రాజకీయ పార్టీలు ఆదాయపు పన్ను రిటర్నులు తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఓవరాల్ బడ్జెట్ లో ఐదు రంగాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. రక్షణ , గ్రామీణ, మౌళిక సౌకర్యాలు, ప్రధానమంత్రి ముద్రా యోజనా.. పారిశ్రామిక రంగానికి జైట్లీ ప్రాధాన్యం ఇచ్చి వీటికే లక్షల కోట్లు కేటాయించారు..
వివిధ రంగాలకు కేటాయించిన నిధులు.. ఇలా ఉన్నాయి..
– మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.48వేల కోట్ల కేటాయింపు.
– ఫ్లొరైడ్ బాధిత గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా.
– గ్రామాల్లో అభివృద్ధి 42 నుంచి 60శాతానికి పెరిగింది.
– స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
– 2018కల్లా గ్రామీణ విద్యుద్దీకరణ పూర్తి. దీంతో అన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం.
– ప్రధాన మంత్రి పజల్ యోజన కింద రోడ్లు, 133 కి.మీ. ప్రతి రోజూ నిర్మించనున్నాం.
* మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం
-ఉపాధిహామీ పథకంలో మహిళలకు ప్రాతినిథ్యం పెంపు
– కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార కేంద్రాలు
-100 రోజుల కనీస ఉపాధిహామీ.
– పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు. పాల కేంద్రాలను పాలవెల్లువ పథకం కింద రూ.8వేల -కోట్లతో పాలసేకరణ కేంద్రాల స్థాపన.
– రైతులకు రూ.10లక్షల కోట్లను రుణాలుగా ఇవ్వాలన్న లక్ష్యం.
– సాగునీటి రంగానికి ప్రత్యేకనిధి.
– పెద్దనోట్ల రద్దుతో రానున్న కాలంలో మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి.
– రైతులకు అండగా ఫసల్ బీమా యోజనను 30శాతం నుంచి 40శాతానికి పెంచుతున్నాం.
– రైతుల సంక్షేమ, గ్రామీణ ఉపాధి, యువత, మౌలిక సౌకర్యాలు, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ – సుపరిపాలన, విత్త విధానం, పన్ను సంస్కరణలు, నిజాయితీ పనులకు పెద్దపీట.
– రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేశారు. రైల్వేల స్వతంత్ర ప్రతిపత్తి కొనసాగుతుంది.
ఆర్థిక మంత్రి ప్రసంగంలోని పెద్దనోట్ల రద్దు పరిణామాలు ఇలా ఉన్నాయి..
* పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగాయి. దీంతో మరికొందరికి రుణాలిచ్చే సౌకర్యం కలుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గుతాయి
– పెద్దనోట్ల రద్దుతో నల్లధనానికి కళ్లెం పడింది.
– దొంగ నోట్లు, నల్లధనం, ఉగ్రవాదానికి చేయూతనిచ్చాయి.
– పన్ను ఎగవేతల్లో నల్లధనం పేరుకుంది. నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థగా మారింది.
– రెండోవది పెద్దనోట్ల రద్దుపై చర్యలో ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది.
-ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉంది. అయినా భారత్ అన్నిరంగాల్లో ప్రగతి సాధించింది.
– ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులో ఉంది.
* నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపులు ఉండవని పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగంలో మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 10 కీలక అంశాలో ఈ బడ్జెట్ లో దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. అవి
1. రైతుల ఆదాయం వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడం.
2. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉపాధిని కల్పించేలా మౌలిక వసతులు, పెట్టుబడులు.
3. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం నిర్ణయాలు.
4. పేదలు, బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం, వారికి గృహ నిర్మాణం.
5. ఉత్పాదకత, ప్రజల జీవనంలో క్వాలిటీ పెంచేలా ఇన్ ఫ్రాస్ట్రక్చచర్ రూపకల్పన.
6. ఆర్థిక రంగంలో వృద్ధి, స్థిరత్వం కోసం తీసుకునే చర్యలు.
7. పారదర్శకత, వేగంగా లావాదేవీల కోసం డిజిటల్ ఎకానమీ.
8. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన, మెరుగైన ప్రభుత్వ సేవలు.
9. అందుబాటులోని అన్ని వనరులనూ వాడుకుంటూ, ఆర్థిక స్థిరత్వం దిశగా చర్యలు.
10. నిజాయితీగా పన్నుల వసూళ్ల దిశగా నిర్ణయాలు.
* ఉపాధి హామీకి పెద్దపీట
2017-18 బడ్జెట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పెద్దపీట వేశారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి అధికంగా నిధులు కేటాయించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఈ పథకానికి రూ. 48 వేల కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ. 38,500 కోట్లు కేటాయించారు. ఈ డబ్బు మొత్తాన్ని ఖర్చుచేస్తే.. ఈ పథకం మీద ఇప్పటివరకు ఖర్చుపెట్టిన అత్యధిక మొత్తం ఇదే అవుతుందని గత బడ్జెట్ ప్రసంగం సమయంలో అరుణ్ జైట్లీ చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వెయ్యి కోట్ల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెస్తామని జైట్లీ అన్నారు. 15వేల పంచాయతీలకు పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో ప్రతి గ్రామీణ కుటుంబానికి 100 రోజుల ఉపాధి కల్పన వస్తుందని అన్నారు. గత సంవత్సరం నిధులు పూర్తిగా వినియోగించారని మహిళల భాగస్వామ్యం కూడా 48 శాతం నుంచి 55 శాతానికి పెరిగిందని తెలిపారు.
బడ్జెట్ లోని మరికొన్ని ముఖ్యాంశాలు
* రైతులకు అండగా ఫసల్ బీమా యోజనను 30శాతం నుంచి 40శాతానికి పెంచారు.
* పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు. పాల కేంద్రాలను పాలవెల్లువ పథకం కింద రూ.8వేల కోట్లతో పాలసేకరణ కేంద్రాల స్థాపన.
* గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
* గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక సంస్కరణలు వేగవంతంగా ఉన్నాయి. ఇందులో జీఎస్టీ ఒకటి.
* ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉంది. అయినా భారత్ అన్నిరంగాల్లో ప్రగతి సాధించింది.
* వ్యవసాయ రుణాలకు రూ. 10లక్షల కోట్లు కేటాయింపు
* ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్లో వ్యవసాయ రంగానికి 60 రోజుల వడ్డీ మినహాయింపు
* నాబార్డుతో సహకార బ్యాంకులు, వ్యవసాయ సంఘాలను అనుసంధానిస్తాం
* ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలోనూ భూసార పరీక్ష కేంద్రాల ఏర్పాటు
* సాగునీటి సౌకర్యం కోసం రూ.40వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు
* ఈనామ్లు రూ.240 నుంచి రూ.500 పెంపు
* రైతులు, గ్రామీణ ఉపాధి, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
* నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా ఆర్థిక వ్యవస్థలో అతి గొప్ప మార్పునకు పునాది పడింది.
* ముడి చమురు ధరల్లో ఒడిదొడుకులు ఇబ్బంది పెట్టాయి.
* దేశ జీడీపీ 2017-18లో 7.6 శాతం, 2018-19లో 7.8 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.
* మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన దిశగా బడ్జెట్ రూపొందించాం.
* ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విదేశీ పెట్టుబడుల విధానాలు సరళీకరిస్తున్నాం.
* ఈ బడ్జెట్ ద్వారా మూడు సంస్కరణలు తీసుకొచ్చాం. బడ్జెట్ను ఫిబ్రవరికి మార్చాం. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపాం.
* ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయంలా కాకుండా రంగాల వారీగా బడ్జెట్ రూపొందించాం.
* రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు చేస్తాం.
* 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.
* ఈ ప్రభుత్వం సంపూర్ణ పారదర్శక విధానాలను అమలు చేస్తోంది.
* విదేశీ మారక ద్రవ్యనిల్వలు 361 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
* భారత్ ఉత్పాదక రంగంలో ప్రపంచంలో 9వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకింది.
* ద్రవ్యోల్బణాన్ని రెండంకెల నుంచి కనిష్ఠస్థాయికి తగ్గించాం.
* నల్లధనం అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేశాం. నల్లధనంపై యుద్ధం ప్రకటించాం. అవినీతిని నిర్మూలిస్తాం.
