సాధారణ వ్యక్తి నుంచి మెగా స్టార్ దాకా..

chiranjeevi-megastar

విలన్ గా సినీ రంగ ప్రవేశం చేశారు. అనక హీరోగా ఇండస్ట్రీలో నిలబడ్డాడు.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత కాళ్లపై నిలబడి ఇండస్ట్రీని ఏలే స్థాయికి ఎదిగిన చిరంజీవి నట జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం.. దాదాపు మూడు దశాబ్ధాల పాటు వెండితెరను ఏలిన మెగా మహారాజు ఒక్క చిరంజీవినే.. కోట్లాది అభిమానుల గుండె చప్పుడు అయ్యి విజయాలకు మారుపేరుగా నిలిచారు.
మొగల్తూరులో జన్మించిన చిరంజీవి నట ప్రస్థానం 1978లో ప్రారంభమైంది.. పునాదిరాళ్లతో ఆయన ఇండస్ట్రీకి పునాది పడింది. అక్కడినుంచి అంచెలంచెలుగా కెరీర్ లో చిరు ఎదిగారు. తర్వాత విలన్ , హీరోగా ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా చిరు చేశాడు. అనతికాలంలోనే మంచి నటుడిగా.. మంచి డ్యాన్సర్ గా పేరు గడించారు. 1983లో విడుదలైన ఖైది తెలుగు సినిమా పరిశ్రమలో చిరును పెద్ద హీరోను చేసింది..మాస్ ఫాలోయింగ్, ఫైట్స్ , డ్యాన్స్ లతో చిరు ఇండస్ట్రీలో కొత్త చరిత్రను సృష్టించాడు. మాస్ జనాలకు దగ్గరయ్యే సినిమాలను తీసి చేరువయ్యాడు. దొంగమొగుడు, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడులో ఆయన టైమింగ్, నటనతో జనాలను ఉర్రూతలూగించారు. ఇంద్రతో రాయలసీమ రాజకీయాన్ని తెరపైకి చూపించారు. 149 సినిమాల్లో 100కు పైగా కమర్షియల్ హిట్లు 30కి పైగా బ్లాక్ బస్టర్ లు.. ఉన్నాయి.. ఆయన సినిమా గురించి కలెక్షన్ల గురించి మాత్రమే మాట్లాడుకునే సాధారణ వ్యక్తి చిరు కాదు.. సామాజిక సేవతో అభిమానులను ముందుండి నడిపిన వ్యక్తి చిరంజీవి. తెలుగు చిత్ర పరిశ్రమ లో నెంబర్ 1 స్థానం 9 ఏళ్లుగా ఖాళీగా ఉందంటే చిరంజీవి ఇమేజ్ ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోవచ్చు.. మళ్లీ ఇప్పడు తన 150 వ సినిమాతో మెగా అభిమానులను అలరించడానికి వస్తున్నాడు. అదే ఊపుతో అదే డ్యాన్సులతో అదే కసితో కాచుకోండి..
రాజకీయాలు బెడిసికొట్టాయి. 9 ఏళ్ల తర్వాత మళ్లీ చిరు ముఖానికి రంగేసుకొని కత్తి సినిమా రిమేక్ చేస్తున్నాడు. ఖైదీ నంబర్ 150 సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్నాడు.. ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తన పూర్వ పు వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు.. రజనీకాంత్+కమల్ హాసన్ కలిస్తే చిరంజీవి లా ఉంటాడని చెప్పిన దిగ్గజ దర్శకుడు బాలచందర్ చిరంజీవి కీర్తిని ఆకాశానికేత్తేశాడు. అలాంటి చిరంజీవి మళ్లీ ఇన్నాళ్లకు వెండితెరమీదకు వస్తున్నాడు.. అభిమానులకు పండుగ తెస్తున్నాడు.. చిరంజీవికి వెల్ కం.

To Top

Send this to a friend