సాక్షి చానల్, పత్రిక.. ఇతర ఆస్తులు – జగన్ కు కష్టకాలం..

sakshi-tv-paper-jagan

కేంద్ర ప్రభుత్వం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసిన జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకోరని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.. సింగిల్ బెంచ్ తీర్పు జగన్ కు అనుకూలంగా ఉండడంతో ఈడీ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. వాదనలు విన్న హైకోర్టు సింగిల్ జడ్జి ఈడీ వాదనలు వినకుండా ఆస్తులు స్వాధీనం చేసుకోరాదని తీర్పునిచ్చారని.. ఈ కేసులన్నింటిని ఈనెల 31లోగా పరిష్కరించి ఆస్తుల స్వాధీనంపై తీర్పు చెప్పాలని వ్యాజ్యాలను కిందికోర్టు కు తిప్పిపంపింది..
ఈ నేపథ్యంలో జగన్ కు చుక్కెదురైంది.. వైఎస్ జగన్ కు చెందిన అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఈడీ దాదాపు 700 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. వాటిని ఖాళీ చేయించి స్వాధీనం చేసుకునే పనిలో ఉండగా.. వైఎస్ జగన్, భారతి ఇతర రేవన్, భారతి సిమెంట్స్, సహా పిటిషనర్ దార్లు కోర్టుకు పోవడంతో జగన్ కు అనుకూల తీర్పు వచ్చింది. దీనిపై ఈడీ డివిజన్ బెంచ్ కు వెళ్లడంతో కొట్టివేసి పిటీషన్లు 31లోగా పరిష్కరించి ఆస్తుల స్వాధీనాన్ని తేల్చాలని స్పష్టం చేసింది. దీంతో జగన్ తన ఆస్తులను కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఇందులో జగన్ సాక్షి పత్రిక, సాక్షి చానల్ కూడా ఉండడంతో వాటి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

To Top

Send this to a friend