సాంకేతిక, భారతీయ సంప్రదాయం మేళవించే చిరు కొత్త ఇల్లు

రాంచరణ్ ఈ మధ్య చాలా బిజిబిజీగా గడిపారు. తొలుత ధ్రువ సినిమా.. ఆ తర్వాత చిరంజీవి 150వ సినిమా ఖైదీ సినిమా నిర్మాతగా చాలా పెద్ద బాధ్యతలు మోసారు.. అందుకే కనీసం గడ్డం కూడా తీసుకునే ఓపిక లేదేమో.. ఈ మధ్య చాలా భారీ గడ్డంతో కనిపిస్తున్నారు రాంచరణ్.. ఇప్పుడు అన్ని బాధ్యతలు తీరిపోయాయి. రిలాక్స్ అయిపోయాడు అని అనుకున్నారంతా.. కానీ మళ్లీ మరో బాధ్యతను భుజానకెత్తుకున్నాడు..

చిరంజీవి, రాంచరణ్ ప్రస్తుతం నివసిస్తున్న ఇళ్లు పదిహేనేళ్ల క్రితం ఓల్డ్ స్టైల్ కట్టింది. రాంచరణ్ పెళ్లి అయ్యాక స్థల ఇబ్బందితో కొంచెం ఇబ్బంది ఏర్పడిందట.. అందుకే కొద్దిరోజుల క్రితం చిరంజీవి ఇంటిని కూలగొట్టించి అత్యాధునిక సాంకేతిక విలువలు, భారతీయ సంప్రదాయం మేళవించే విధంగా ఇంటిని చిరు, రాంచరణ్ రీడిజైన్ చేయిస్తున్నారు. ఇప్పుడు సినిమాలు పూర్తయి పోవడంతో రాంచరణ్ దగ్గరుండి కొత్త ఇంటి నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారట.. ఇలా కొత్త ఇళ్లు కడుతున్నారు.. ఇంట్లోకి ఎవరైనా కొత్త వాళ్లు వస్తున్నారా.. చిరుకు మనవడు వస్తున్నాడా..? అని విలేకరుల ప్రశ్నించగా రాంచరణ్ నవ్వి ఊరుకున్నాడట.. ‘ఇప్పటికీ నన్ను నేను ఓ పిల్లాడిగానే అనుకుంటాను. నేను పెద్దవాడినయ్యాననే ఫీలింగ్ వచ్చిన తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవు’ అంటూ రాంచరణ్ తనకు ఇప్పుడే పిల్లలు కనే ఆలోచనల లేదని స్పష్టం చేశారు.

To Top

Send this to a friend