సల్మాన్ ప్రేయసి కండల కాంతమ్మే

ఐష్.. ఐశ్వర్యా రాయ్ చూస్తేనే మగాళ్ళు ఐష్ అవుతారు. అలాంటి అందగత్తెను వద్దన్నాడు. కత్తిలాంటి ఫిగర్ కత్రినాను దూరం చేసుకున్నాడు. ఇలా చాలామంది అందగత్తెలను సల్మాన్ ఖాన్ ప్రేమించాడు. కారణాలు పైవాడికి ఎరుక. అందరూ దూరమయ్యారు. చివరకు, రొమేనియన్ బ్యూటీ లులియా వంతర్ వలలో పడ్డాడని బాలీవుడ్ టాక్. మహా మహా అందగత్తెలను వదిలేసి లులియాలో ఏం చూసి సల్మాన్ ప్రేమించాడు? అనే విషయం చాలామందికి అంతుబట్టలేదు. ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్టే అనుకోవాలి. రొమేనియన్ బ్యూటీ మంచి హాట్ ఫిగర్ మాత్రమే కాదు, కండల కాంతమ్మ. రీసెంట్ గా జింలో లులియా వంతర్ దిగిన ఫోటోలు లీకయ్యాయి. ఈ ఫిగర్ సిక్స్ ప్యాక్ చూసి షాక్ అవ్వడం ఒక్కటే తక్కువ. 50ఏళ్ళ వయసులోనూ సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ విషయంలో కుర్రహీరోలకు సవాల్ విసురుతున్నాడు. లులియా ఈ ఫిట్నెస్ చూసే సల్మాన్ ప్రేమలో పడుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదూ!!

To Top

Send this to a friend