సల్మాన్ కు ఏడేళ్ల జైలా..? బయటకా..?

కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ కటకటాల పాలైన సంగతి తెలిసిందే.. 1998లో అనుమతి లేని మరణాయుధాలు వాడి కృష్ణ జింకలను చంపేశాడనే అభియోగాలపై సల్మాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి గతంలో జైల్లో వేశారు. మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసుల్లో సల్మాన్ నిర్ధోషి అని తేలింది. మూడో కేసు తీర్పును నేడు వెలువడనుంది. రాజస్థాన్ లోని జోథ్ పూర్ న్యాయస్థానం ఈ తీర్పు చెప్పనుంది. అరెస్ట్ అయ్యాక బెయిల్ పై విడుదలైన సల్మాన్ అనంతరం కోర్టు పేషీలకు హాజరవుతున్నారు.

ఈ కేసులో సల్మాన్ దోషిగా రుజువైతే ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా రోజులు జైలు శిక్ష అనుభవించి సల్మాన్ తుది తీర్పుపై ఉత్కంఠగా ఉన్నారు. తీర్పు కోసం కోర్టుకు హాజరయ్యేందుకు సల్మాన్ ప్రత్యే విమానంలో జోధ్ పూర్ వచ్చారు. సల్మాన్ తో పాటు ఆయన సోదరి అల్వీరా, లాయర్లు వెంట వచ్చారు. ఈరోజు కనుక నేరం రుజువైతే సల్మాన్ భవిష్యత్ మరోసారి అంధకారంలో పడిపోతుంది..

To Top

Send this to a friend