” సరయు” ఫస్ట్ లుక్ లాంచ్


భగీరథ్ పరశురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బలరామనాయుడు కర్రీ సమర్పణలో,భగీరథ్ పరశురామనాయుడు మరియు రమాదేవి కర్రీ నిర్మాతలుగా తెరకెక్కిన సినిమా “సరయు” అన్ని ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకుని సెన్సార్ కు సిద్దమయింది.ఈ సందర్బంగా ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.అనంతరం అయన మాట్లాడుతూ …దర్శకుడు శ్రీనివాస్ నాదగ్గర చాలాకాలం దర్శకత్వశాఖలో పనిచేసాడు.ఇప్పుడు సరయు సినిమా తో దర్శకుడుగా మారటం చాల సంతోషంగా ఉంది.ఇది లవ్ మరియు థ్రిల్ సబ్జెక్టు.అందరు కొత్తవాళ్లను ఎంచుకుని సినిమా తీయటం కష్టం అయినప్పటికీ చాల బాగా తీసాడు.పోస్టర్ బాగుంది సినిమా కూడా బాగుంటుంది అందరికి శుభాకాంక్షలు అన్నారు.
దర్శకుడు రమా కె శ్రీనివాస మాట్లాడుతూ..నాకు సినీ జీవితాన్ని ప్రసాదించిన మా గురువు తమ్మారెడ్డి భరద్వాజ గారు నా సినిమా పోస్టర్ ని విడుదల చేయటం నేను మర్చిపోలేని సంఘటన.ఇదొక లవ్ మరియు థ్రిల్లర్ స్టోరీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి అయ్యాయి త్వరలో సెన్సార్ కు పంపుతున్నాము ఉగాది తర్వాత పాటలు విడుదల చేసి సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం అన్నారు.డి.ఓ.పి లక్కీ ఏకారి మాట్లాడుతూ ..మంచి లొకేషన్స్ లో సినిమా తీసాము అందరికి తప్పకుండ నచుతుంది అన్నారు.
సంగీత దర్శకుల్లో ఒకరయిన షణ్ముఖ్ మాట్లాడుతూ ..మొత్తం నాలుగు పాటలు ఉంటాయి.సింగర్స్ అందరు కొత్తవాళ్లే చక్కగా పాడారు.లిరిక్ రైటర్స్ ని కూడా కొత్తవాళ్లను తీసుకున్నాం అన్ని పాటలు చాల బాగా వచ్చాయి.
తారాగణం:సుహాన్ శిష్ట, ఉజ్వల్ కిరీట్,నాజీ,నవ్య,హారిక
ఫోటోగ్రఫీ:లక్కీ ఏకారి.సంగీతం:షణ్ముఖ్,పవన్,ప్రీతమ్.కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం:రామ కె శ్రీవివాస్

To Top

Send this to a friend