సమంత మంచి మనసు.. కేటీఆర్


తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న టాప్ హీరోయిన్ సమంత తెలంగాణలోని చేనేత కుటుంబాలను పరామర్శిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే సమంత రెండుసార్లు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత సహకారం సంఘానికి ఒకసారి .. సిరిసిల్ల చేనేత కార్మికులను ఒకసారి కలుసుకొని వారి సమస్యలు తెలుసుకున్నారు. చేనేత కార్మికులతో ముచ్చటించి మార్కెటింగ్ విషయంలో సలహాలిచ్చారు సమంత..

సమంత ఒక్కరే కాదు.. తనతోపాటు ప్రముఖ డిజైనర్లను వెంటేసుకొని చేనేత కార్మికుల వద్దకు వెళ్లిన సమంత డిజైనర్లతో చేనేతలకు అవగాహన కల్పించారు. మార్కెటింగ్ విషయంలో వారికి భరోసా కల్పించారు.

సమంత వరుస పర్యటనలను తెలుసుకొని మంత్రి కేటీఆర్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. సమంతకు థ్యాంక్స్ చెప్పారు. సమంత ఇలా సినీ నటిగా బిజీగా ఉంటూనే వీలు చిక్కినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా కేవలం తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గానే కాకుండా తన వంతు బాధ్యతగా చేనేతలకు అండగా ఉంటానని చెప్పి కేటీఆర్ ట్వీట్ కు ధన్యవాదాలు తెలిపింది సమంత..

To Top

Send this to a friend