సమంత తన ప్రియుడుకు భారీ గిఫ్ట్!

సమంత తన ప్రియుడు, హీరో అక్కినేని నాగచైతన్యకు భారీ గిఫ్ట్ ఇచ్చిందట.. త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్న ఈ జంట ఆ పనుల్లో బిజీగా ఉండగానే సమంత ఏరికోరి నాగచైతన్యకు ఈ బైక్ కొనిచ్చినట్టు సమాచారం. అత్యంత విలాసవంతమైన ఎంవీ అగస్టా బైక్ ను సమంత దాదాపు రూ.27లక్షలు పెట్టి నాగచైతన్యకు గిఫ్ట్ గా బహూకరిరించదని ఫిల్మ్ నగర్ టాక్.. ఈ బైక్ రిజిస్ట్రేషన్ కోసం నాగచైతన్య ఈరోజు మధ్యాహ్నం కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసుకు రాగా ఈ విషయం వెలుగుచూసింది..

ఈ బైక్ రిజిస్ట్రేషన్ కోసం నాగచైతన్య స్వయంగా ఈ ఖరీదైన బైక్ ను నడుపుకుంటూ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చాడు. రోడ్ ట్యాక్స్ కింద నాలున్నర లక్షలు చెల్లించాడు. అనంతరం నాగచైతన్య ఫొటో దిగి, సంతకాలు చేసి రిజిస్ట్రేషన్ పార్మాలిటీస్ పూర్తిచేశాడు. డిజిటల్ సంతకం కూడా చేశాడు. దీంతో ఆర్టీఏ అధికారులు నాగాచైతన్య బైక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఈ బైక్ కు అధికారులు టీఎస్ 07 ఎఫ్ఎం 2003 నంబర్ ను కేటాయించారు.

To Top

Send this to a friend