సప్తగిరి ఎక్స్ ప్రెస్ 300 నుంచి 350కి

3x20-2

శ్రీ సాయి సెల్యులాయిడ్ పతాకం పై మాస్టర్స్ హోమియో అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన సప్తగికి ఎక్స్ ప్రెస్ సూపర్ హిట్ టాక్ తో తెలుగునాట దూసుకుపోతుంది. టాలీవుడ్ స్టార్ కమీడియన్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టిందని సప్తగిరి ఎక్స్ ప్రెస్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలానే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న విశేష ఆదరణ నేపథ్యంలో థియేటర్ల సంఖ్య 300 నుంచి 350కి పెంచినట్లుగా నిర్మాత రవికిరణ్ అధికారికంగా ప్రకటించారు. ఇంతటి ఊహించని విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సినిమా డాక్టర్ రవికిరణ్. సినిమాటోగ్రాఫ్ రామ్ ప్రసాద్, ఎడిటర్ గౌతంరాజు ఈ సినిమాను తమ నైపుణ్యంతో ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించే విధంగా తీర్చి దిద్దారని డైరెక్టర్ అరుణ్ చెప్పారు. ఇక ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.

To Top

Send this to a friend