సన్నీలియోన్ లా సంతోషపెట్టండి..

ఒక్కోడిది ఒక్కో వ్యూస్ ఎవరి అభిప్రాయం వారిది.. కానీ మన తిక్క రాంగోపాల్ వర్మదీ మరో దారి.. ఆడవాళ్లంటే అస్సలు నచ్చక కట్టుకున్న భార్యకు కూడా విడాకులిచ్చేశాడు వర్మ. అంతేకాదు.. ఆడవాళ్లను కేవలం ఆనందం కోసమే వాడాలని అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బుక్ అయ్యాడు. ఆ వివాదాల పరం పరనుంచి తేరుకోకముందే మరో వివాదంలో పీకల్లోతూ కురుకుపోయాడు. అతడి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగి కేసులు నమోదయ్యాయి.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆయన ట్వీట్ లో ‘ప్రపంచంలో ప్రతి మహిళా.. సన్నీ లియోన్ లా పురుషులకు సంతోసాన్నివ్వాలని కోరుకుంటున్నట్లు’ పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

వర్మ చేసిన ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. నీ తల్లినీ, కూతుర్ని కూడా ఇలానే అంటావా అని ఒకరంటే.. నీ తల్లిని కూడా ఇలాగే అడుగుతావా అని మరొకరు రీ ట్వీట్ చేశారు. కొందరైతే.. మహిళల పట్ల ఇలా వ్యాఖ్యానించినందుకు రాంగోపాల్ వర్మతో ఇక నుంచి హీరోలు, హీరోయిన్లు ఎవరూ సినిమాలు చేయవద్దంటూ ట్వీట్ చేశారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై గోవాలో కేసు నమోదైంది. సామాజిక ఉద్యమకారుడు విశాక బాంబ్రే వర్మపై కేసు పెట్టారు. వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

To Top

Send this to a friend