సంబరాలపై మన‘సాక్షి’తో చెప్పు ..


పొద్దున్నే ఫోన్ చేశాడు మా ఫ్రెండ్.. ‘మళ్లీ పిలుపొచ్చిందిరా.. వెళ్లితే బాగుటుందా..?’ అని.. డబ్బు మనిషినే ఎంత దూరమైన తీసుకెళ్తుంది. ఆ ఆశ ఉంది కాబట్టే వాడు మళ్లీ ఆశపడ్డాడు.. పాత జ్ఞాపకాలను వదిలేశాడు.. జీవితం గొప్ప పాఠం నేర్పినా కానీ వాడిలో మార్పు రాలేదు.. నిర్ధయగా గెంటేసినా పాత సంస్థపై ప్రేమ చావలేదు.. అందుకే 20 వేలు ఇస్తాననగానే బిస్కట్ కోసం ఊపుకుంటూ బయలుదేరాడు..

మా ఫ్రెండు సాక్షి పత్రికలో సబ్ ఎడిటర్ గా చేస్తున్నాడు.. ఆ పత్రిక యాజమాన్యం వాడిని నిర్దయగా ట్రాన్స్ ఫర్ పేరుతో రాష్ట్రానికి ఈ చివర ఖమ్మంలో ఉన్న వాడిని తిరుపతికి పంపించింది. భార్య, చిన్న పిల్లాడుతో అప్పుడే మొదలైన వాడి సంసారంలో ఇది పెద్ద అవరోధంగా నిలిచింది.. బతుకుజీవుడా అని ట్రాన్స్ ఫర్ లెటర్ చేత పట్టి హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయం చుట్టూ తిరిగాడు.. మఫిసిల్ ఎడిటర్ వద్ద కాళ్లావేళ్లా పడ్డాడు.. జీవితం గందరగోళమవుద్దని ప్రాధేయపడ్డాడు.. కానీ సంస్కరణలంటూ ఆ ఎడిటర్ తప్పదన్నాడు. అందరినీ కలిసినా భ్రష్టుపట్టిన విధానాలను అమలు చేస్తూ సంస్థ సంకనాకిపోయేలా చేసిన ఆ పత్రిక యాజమాన్యం కరగలేదు.. వీడి ట్రాన్స్ ఫర్ రద్దు చేయలేదు..

ఇక భార్యపిల్లల్ని అత్తారింట్లో వదిలి.. ఉన్నడబ్బులతో హైదరాబాద్ బాట పడ్డాడు.. ఫ్రెండ్ రూంలో ఉండి హైదరాబాద్లోని అన్ని న్యూస్ చానళ్లు, పత్రిక కార్యాలయాలకు తిరిగాడు. ఒక్క ఉద్యోగం అంటూ వాడు పడ్డ తాపత్రాయానికి తెలంగాణ చానల్ టీన్యూస్ కనికరించింది.. 15వేలతో ఉద్యోగం ఇచ్చింది.. సంవత్సరం గడిచింది. 20 వేలతో వాడి జీవితం ఇప్పుడు సాఫీగా సాగిపోతోంది.. భార్యపిల్లలతో ఖమ్మం వదిలి హైదరాబాద్ లో కులసాగా సాగిపోతోంది వాడి జీవితం..

ఇప్పుడే మళ్లీ ట్విస్ట్ ట్రాన్స్ ఫర్లతో అల్లకల్లోలం చేసిన ఆ సంస్థ నుంచి సీనియర్ జర్నలిస్టులందరూ సంస్థను వీడారు. మళ్లీ సబ్ ఎడిటర్ల కోసం ఆ సంస్థ వేట మొదలుపెట్టింది. అందుకోసం ట్రాన్స్ ఫర్ల పేరు చెప్పి వదిలించుకున్న వారికి ఫోన్లు చేయడం మొదలుపెట్టింది. ఆ పత్రిక సంస్థ మళ్లీ వీడి జీవితంతో ఆడుకుంది.. ‘20వేలు ఇస్తాం.. సొంత ఖమ్మంలో పొస్టింగ్ వస్తావా’ అనిడిగిందట.. సొంత జిల్లా.. అమ్మానాన్న ఉంటారని మనోడు ఆశపడి నాకు ఫోన్ చేశాడు.. జర్నలిస్టుల జీవితాలతో ఆటాలడి చిన్నాభిన్నం చేసిన ఆ పత్రికకు ఏదీ విశ్వసనీయత అన్నాను.. కనీసం ‘3 ఏళ్లు గ్యారెంటీ ఇవ్వమనరా.. నీ ఉద్యోగానికి అని చెప్పా’.. మాకే గ్యారెంటీ లేదు మీకు ఎలా ఇస్తాం అన్నాడట మఫిసిల్ ఎడిటర్..
చివరగా వాడికి చెప్పా.. ‘నీకు జీతం కావాలా.. జీవితం కావాలా తేల్చుకో’ అని..

ఈ ఒక్క ఉద్యోగి జీవితమే.. కాదు.. సాక్షి వైఎస్ చనిపోయాక.. వైఎస్ జగన్ సాక్షి పగ్గాలు చేపట్టాక ఆ పత్రికే భష్ట్రు పట్టిపోయింది. అస్మదీయులంటూ కొందరిని సాక్షి యాజమాన్యంలో చేర్చుకున్న కొందరు.. వారు పత్రికను దారుణంగా దెబ్బతీశారు. సంస్తను నష్టాల్లోంచి లాభాల బాట పట్టించేందుకు ఉద్యోగులను తగ్గించడాన్ని చేశారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అప్పటివరకు సాక్షినే నమ్ముకొని జీవిస్తున్న జర్నలిస్టులను ట్రాన్స్ ఫర్ల పేరు చెప్పి వదిలించుకున్నారు. అనంతరం తెలంగాణ, ఏపీలోని ఎడిషన్లను ఎత్తివేసి అన్నింటిని ఒకే చోట పెట్టి.. మరికొంత మందిని వదిలించుకున్నారు. ఈనాడు ఎడిషన్లను ఎత్తివేస్తుందని తెలిసి ముందే ఇలా చేసి సాక్షి దారుణంగా దెబ్బతింది. ఉన్న కొద్దిపాటి జర్నలిస్టులు సంస్థను వీడారు. సర్క్యూలేషన్ బాగా తగ్గిపోయింది. మళ్లీ సొంత జిల్లాలకు సాక్షి ఎడిషన్లను తరలించినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. తరువాత ఆర్సీ సెంటర్లను కూడా తీసేసి రిపోర్టర్లకు జీతాలు కట్ చేశారు. ఎవరి ఇంటి నుంచి వారే వార్తలు పంపాలని ఆదేశించారు. అనంతరం రోజురోజుకు తీసికట్టుగా మారిన సంస్థ ఆర్థిక పరిస్థితి ని కాపాడాలని ఇప్పుడు ఏకంగా వార్తలు రాసే జర్నలస్లుల చేత యాడ్స్ కలెక్షన్ వసూలు చేస్తోంది. సాక్షి 9వ వార్షికోత్సవం పేర ఇప్పుడు సాక్షి జర్నలిస్టులు లక్షల లక్షలు యాడ్స్ కలెక్ట్ చేసే పనిలో బిజిగా ఉన్నారు.

ఓ ఉదయం, వార్త, సూర్య ఇవన్నీ కమ్మ సామాజికవర్గానికి.. అప్పటివరకు రాష్ట్రంలో అప్రతిహతంగా ఉన్న టీడీపీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన పత్రికలు.. కానీ వాటిపై సామ, ధాన బేద దండోపాయాలు వేసి ఈ కమ్మ పత్రికలు, కమ్మ నేతలు ఆ పత్రికలను మూసివేశారు. చానాళ్లకు రాష్ట్రంలో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆయన ప్రోద్బలంతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో సాక్షి ఏర్పడింది. ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాల్లో కమ్మ పత్రికలు చూపించిందే నిజమని నమ్మి మోసపోయిన జనాలకు సాక్షి రెండో పార్వ్శం చూపించింది. అవినీతి నేతల అవినీతి, మోసాన్ని బయటపెట్టింది. ప్రజల గొంతుకై నిలిచింది. కానీ ఆ తర్వాత సాక్షిలోకి వచ్చిన పెద్దలు ఆ పత్రికను నాశనం చేశారు. ఖర్చులు తగ్గించడం పేర ఉద్యోగులను ట్రాన్స్ ఫర్ చేశారు. అనంతరం ఎడిషన్లను ఎత్తివేసి ఒకే చోట పెట్టారు. ఈ దెబ్బకు ఉన్న ఊళ్లు వదలలేక చాలామంది మంచి మ్యాన్ పవర్ సాక్షిని వీడారు. వీటన్నింటి వల్ల మంచి మ్యాన్ పవర్ సాక్షి కి కరువైంది. ఆ ప్రభావం సర్క్యూలేషన్ పై పడింది. పైగా వార్తలు రాయాల్సిన జర్నలిస్టులను యాడ్స్, సర్య్కూలేషన్ చేయమని ఆదేశించింది.. ఆర్సీ సెంటర్లను ఎత్తివేసి రిపోర్టర్లకు జీతాలు కట్ చేసింది. ఇలా ఈనాడును దాటేస్తామని చెప్పి కనీసం ఆంధ్రజ్యోతి లా కూడా నిబంధనలు పాటించడకుండా సాక్షి దిగజారిపోయింది.

సాక్షి పుట్టి 9 ఏళ్లయింది. 9 ఏళ్ల సంబరం ఇప్పుడు నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవం సందర్భంగా సాక్షి యాడ్స్ కలెక్ట్ చేస్తోంది. ఆ బాధ్యతను వార్తలు రాయడం పక్కనపెట్టి రిపోర్టర్లే తేవాలని ఆదేశించింది. సాక్షి వార్షికోత్సవ సంబరం ఇప్పుడు సంస్థ ఉద్యోగుల్లో ఏమాత్రం లేదు.. కనీసం ప్రజలకు కూడా లేదు. ఎంతసేపు జగన్ భజన తప్పితే బలమైన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై నిలవడం లేదు. అందుకే సాక్షి సంబరం ఎవ్వరికీ ఆనందాన్ని ఇవ్వడం లేదు.

To Top

Send this to a friend