సంచలనం: శాటిలైట్ రైట్స్ 110 కోట్లు


రజినీకాంత్ హీరోగా తమిళ అగ్రదర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రోబో2 . ఈ సినిమా రోబో, టెక్నాలజీ వండర్ గా తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ రోబో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసింది. ఇప్పుడు రెండో పార్ట్ రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే దేశచరిత్రలోనే కళ్తు చెదిరే రేటుకు అమ్ముడుపోయింది..

జీ నెట్ వర్క్ సంస్థ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలతో పాటు డబ్బింగ్ హక్కులు మొత్తం కలిపి రూ.110 కోట్లకు ఈ సినిమాను కొనుగోలుచేసింది. బాహుబలి శాటిలైట్స్ రైట్స్ కంటే కూడా ఇది ఎక్కువే.. దేశ సినిమా చరిత్రలోనే ఇదో సంచలన భారీ రైట్స్ ఒప్పందం అని సినీ జనాలు చెబుతున్నారు. విడుదలకు ముందే ఇంత ధర పలికిన ఈ సినిమా విడుదల అయితే ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాలి.

To Top

Send this to a friend