సంచలనం రేపుతున్న బాబా రాందేవ్ పతంజలి ఫ్రాడ్ వీడియో

ప్రకృతి ప్రసాదం.. కల్తీ రహితం.. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటూ మార్కెట్ ను ముంచెత్తుతున్న రాందేవ్ బాబా పతంజలి ప్రొడక్ట్స్ నిజంగా ఆరోగ్యానికి హాని చేయవా..? బాబా రాందేవ్ కల్తీ లేని ఉత్పత్తులను జనాలకు అందిస్తున్నారా..? మార్కెట్లో దాదాపు 40 ఏళ్లుగా ఉంటున్న మ్యాగీ, నెస్లే సంస్థలకు సాధ్యం కానీ విషతుల్య ఆహార పదార్థాల సరఫరాను పతంజలి అందిస్తుందా అంటే ఇన్నాళ్లు దేశ ప్రజలు ఔననే అనుకున్నారు. అందుకే మ్యాగీ, నెస్లే, ఐటీసీ లాంటి దిగ్గజ కంపెనీల ప్రొడక్టలను కాదనుకుని దేశ ప్రజలందరూ పతంజలి ఉత్పత్తులను కొంటున్నారు. ఇప్పుడు మార్కెట్లో పతంజలి మార్కెట్ విలువ దాదాపు 5వేల కోట్లకు చేరిందట.. నెస్లె, విప్రో, ఐటీసీ లాంటి దిగ్గజ సంస్థల ప్రొడక్ట్ అమ్మకాలు తగ్గుతున్నాయట.. సో మరి పతంజలి ప్రాడక్ట్ మంచివంటూ రాందేవ్ బాబు చెబుతున్నదాంట్లో నిజమెంతా..? దానిపై కొందరు పరిశోధకులు శోదించి నిజాలు నిగ్గుతేల్చారు..

పతంజలిలో కూడా విషతుల్య పదార్థాలున్నాయని.. ఆరోగ్యానికి హానిచేసే పదార్థాలున్నాయని తేలింది.. దీన్ని వీడియోలో ఆధారాలతో నిరూపించారు. పతంజలి పదార్థాల మెనూ ను చూసి మరీ లోపాలను ఎత్తిచూపారు. పతంజలి కల్తీ రహితం అన్న రాందేవ్ బాబా మాటలు వట్టి నీటి మూటలని తేల్చిపారేశారు.. లైఫ్ సూత్ర సంస్థ పతంజలి పదార్థాలపై తయారు చేసిన వీడియో సంచలనం రేపుతోంది..

పతంజలి పదార్థాలు కల్తీయేనని నిరూపించిన ఆ వీడియోను కింద లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend