సంక్రాంతి బ‌రిలో  మెగాస్టార్ `ఖైదీ నంబ‌ర్ 150` 

a5-copy
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న `ఖైదీ నంబ‌ర్ 150` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ‌వుతోంది.  ఈ చిత్రంలో అందాల‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. వి.వి.వినాయక్ ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ  పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోష‌న్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చినందుకు చిత్ర‌యూనిట్ ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. 2017 సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.
నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ -“70 శాతం పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నాన్న‌గారు డ‌బ్బింగ్ కూడా ప్రారంభించారు. ఇప్ప‌టివ‌ర‌కూ చ‌క్క‌ని ఔట్‌పుట్ వ‌చ్చింద‌న్న సంతృప్తి ఉంది. అన్ని ప‌నులు పూర్తి చేసి, జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా `ఖైదీ నంబ‌ర్ 150` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.
ర‌త్న‌వేలు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.
To Top

Send this to a friend