సంక్రాంతి బరిలో పవన్.. ఆనందం రెట్టింపు..

katama_rayudu_poster-new

గబ్బర్ సింగ్ 2 సినిమా.. పవన్ ఆశించిన విజయాన్ని అందుకోలేదు.. అందుకే ఆ సినిమా నిర్మాత, తన ఫ్రెండ్ అయిన శరత్ మరార్ తో కలిసి ప్రస్తుతం కాటమరాయుడు అనే చిత్రాన్ని తీస్తున్నారు పవన్. పవన్ హీరోగా గోపాల గోపాల ఫేం దర్శకుడు డాలి దర్శకుడిగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు చిత్రం యూనిట్ మీడియాకు తెలిపిందే..

బాలక్రిష్ణ, చిరంజీవిలు సంక్రాంతి కానుకగా తమ తమ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఇంత వేడిలో పవన్ కళ్యాణ్ కూడా ఆ సంతోషాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే సంక్రాంతి కానుకగా టీజర్ ను విడుదల చేస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్.. జనవరి 14 సంక్రాంతి కానుకగా సాయంత్రం 7 గంటలకు కాటమరాయుడు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్లాన్ చేస్తున్నారు.. తమిళం హిట్ సినిమా వీరంకు రిమేక్ గా రూపొందుతున్న పవన్ కాటమరాయుడు సినిమాను ఉగాది కానుకగా మార్చి మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు..

To Top

Send this to a friend