షేమ్ ఆన్సర్: జల్లికట్టు.. ఓవైసీ కి ఇలా అర్థమైందా.?

అందరిదీ ఓ దారి అయితే.. వులిపికట్టెది మరో దారి అన్నది ఓ సామెత.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వైఖరి కూడా అలాగే కనపడుతోంది.. తమిళ తంబీలు ఎంతో గొప్పగా ఉద్యమించారు. జల్లికట్లు ఉద్యమం దేశవ్యాప్తంగా స్ఫూర్తినింపింది.. ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమానికి ఊపిరిలూదింది కూడా జల్లికట్టు ఉద్యమమే.. ఇప్పుడు జల్లికట్టు ఉద్యమం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కి కూడా ఇన్ స్పిరేషన్ అయ్యింది. ఆయన తమ మత చాందసవాదానికి జల్లికట్టు ఉద్యమంను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ముస్లింలు తమ భార్యలను వదిలించుకోవడానికి ఉపయోగించే తలాక్ ను తీసేయడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం, సుప్రీంపై నిరసనకు ఓవైసీ నిర్ణయించారు. ముస్లింలలో మూడు సార్లు తలాక్ చెబితే ఇక వారికి విడాకులు అయినట్టే.. మగవారు .. ఆడవారిని ఇలా తలాక్ చెప్పి వారికి అన్యాయం చేస్తున్నారని.. కేంద్రం, సుప్రీం ఈ తలాక్ పై నిషేధం దిశగా సాగుతున్నాయి. అయినా అది అమలు కావడం లేదు..

ఇప్పుడు తాజాగా ఓవైసీ హైదరాబాద్ లో మాట్లాడుతూ.. ‘‘ముస్లింల బహుభార్యత్వంపై, విడాకులు తీసుకునే తలాక్ సంప్రదాయాలు తరతరాలుగా వస్తున్నాయని.. దీనిపై కేంద్రం, సుప్రీంకోర్టులు నిషేధం విధిస్తే.. ముస్లింలందరూ జల్లికట్టు ఉద్యమస్ఫూర్తితో పోరాడాలని ’’ పిలుపునిచ్చారు.. తమిళుల్లాగే మనకు కూడా మన సొంత సంస్కృతి ఉందని.. మనకు నచ్చినట్టు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు ఇచ్చుకునే హక్కు విషయంలో ఎవ్వరి జోక్యం ఉండకుండా పోరాడుదామని కోరారు. కాగా దీనిపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని పలు ముస్లిం మహిళా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఓవైసీ ఇలా అమ్మాయిల ఊసురు తీసే నిర్ణయాలను సమర్ధించి పైగా ఉద్యమించాలని పిలుపునివ్వడం వివాదాస్పదమైంది..

To Top

Send this to a friend