షూటింగ్ పూర్తిచేసుకున్న‌ గీతాఆర్ట్స్‌ ‘ శ్రీరస్తు శుభ‌మ‌స్తు’

విభిన్న‌మైన క‌థాంశాల‌తో తెలుగు సిని ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతున్న‌ అల్లు శిరీష్‌,  లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, ఫ్యామిలీ లోని చ‌క్క‌టి ఎమెష‌న్స్ ని వెండితెర‌పై త‌న క‌థలుగా మ‌లుచుకుని తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతున్న‌ ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కుడిగా, ఏస్‌ ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారు నిర్మాత‌గా,  ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం  ‘శ్రీరస్తు శుభ‌మ‌స్తుస‌. ఈ చిత్రానికి సంబందించి చివ‌రి షెడ్యూల్ ని కాశ్మీర్ లాంటి మెస్ట్ బ్యూటిఫుల్ విజువ‌ల్స్ లో కొన్ని సన్నివేశాలు, ఓసాంగ్ చిత్రీకిరించారు. దీంతో చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్త‌యింది. అతిత్వ‌ర‌లోనే  ఈ వారం లో ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని, అతి త్వ‌ర‌లో థ‌మ‌న్.S.S  సంగీతం అందించిన ఆడియో విడుద‌ల చేస్తారు. చిత్రాన్ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌టానికి  నిర్మాత స‌న్నాహ‌లు చేస్తున్నారు..
ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్(బుజ్జి) మాట్లాడుతూ ”  అల్లు శిరీష్ తో నా ట్రావెలింగ్ చాలా బావుంది. చాలా మంచి స్నేహితుడు.  త‌న‌కి ఫ్యామిలి అంటే చాలా ఇష్టం. జాయింట్ ఫ్యామిలి వుండాలి. అంతా క‌ల‌సి తీసుకునే నిర్ణ‌యాలు నిల‌బ‌డ‌తాయ‌నే న‌మ్మె వ్య‌క్తి. త‌న వ్య‌క్త‌త్వం గొప్ప‌ది. అదే మా సినిమా. ఫ్యామిలి ఎమెష‌న్స్ కి విల‌వ‌లు త‌గ్గుతున్న ఈరోజుల్లో, ఫ్యామిలి అంటే ప‌క్కింటి వాడి మేట‌ర్ కాదు మ‌న‌ది మ‌న ఫ్యామిలి, మ‌న అనుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌నైనా సింపిల్ గా సాల్వ్ చేయ‌చ్చు అని తెలియ‌జెప్పె మంచి చిత్రం మా శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. అన్ని ఎమోష‌న్స్ ని క‌లిపి శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంలో చూపించాము.  శిరీష్ ఎన‌ర్జి సూప‌ర్బ్, లావ‌ణ్య తొ వ‌చ్చే స‌న్నివేశాలు యూత్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి.  శిరీష్ పాత్ర‌లో ప్ర‌తి ఓక్క కుర్రాడు త‌న‌ని తాను చూసుకుంటాడు. అంత అంద‌మైన పాత్ర‌లో శిరీష్ అంత‌కు మించి న‌టించాడు. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంభందించి చివ‌రి షెడ్యూల్ ని కాశ్మిర్ లాంటి అత్య‌ద్బుత‌మైన అంద‌మైన లోకేష‌న్స్ లో షూట్ చేశాము.ఈ షెడ్యూల్ లో ఓ సాంగ్‌, కొన్ని స‌న్నివేశాలు చిత్రీకరించాము. దీంతో దాదాపు షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌, రావుర‌మేష్‌, సుమల‌త‌, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, , రవి ప్రకాష్, రణధీర్,  హంసానందిని, సుమిత్ర లాంటి న‌టీన‌టుల‌తో ఈ చిత్రం చేశాము. ప్ర‌తి కేర‌క్ట‌ర్ కి ప్రాముఖ్య‌త వుంటుంది. ప్ర‌తి కేర‌క్ట‌ర్ ఇంకో కేర‌క్ట‌ర్ కి లింక్ వుంటుంది. అంత చ‌క్క‌గా అన్ని కేర‌క్ట‌ర్స్ సెట్ అయ్యాయి. తెర‌పై వీరంద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడు  వీరంతా రియ‌ల్ రిలేష‌న్స్  అనుకునేలా అంద‌రూ ఇన్‌వాల్వ్ అయ్యి న‌టించారు.  ఆల్‌రెడి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.   అతిత్వ‌ర‌లో మా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌, మ‌రియు ఆడియో విడ‌దుల చేయ‌నున్నాము. త్వ‌ర‌లోనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ఆశీర్వ‌చ‌నాల‌కోసం తీసుకువ‌స్తాము. మా చ‌క్క‌టి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ కి థ‌మ‌న్.య‌స్‌.య‌స్ సంగీతం అందిస్తున్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత అల్లు అర‌వింద్ గారికి నా ధ‌న్య‌వాదాలు.”అని అన్నారు..
హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. నాకు మెద‌టి నుండి కూడా మంచి చిత్రాలు చేయ్యాలి అనే వుండేది. అదృష్ట‌మె, కాక‌తాళీయ‌మో కాని ఆ ద‌శ‌లోనే మంచి చిత్రాలు చేసాను. క‌ల‌సిన వారంద‌రూ మంచి చిత్రాలు తీస్తున్నావు అని అంటుంటే మ‌న‌సులో చాలా ఆనందంగా వుంటుంది. క‌మ‌ర్షియ‌ల్‌ ఫార్ములాని మిక్స్ చేసి ఓ మంచి ఫ్యామిలి క‌థ‌ని ద‌ర్శ‌కుడు బుజ్జి నాకు చెప్పారు. సినిమా వినొద‌మే కాదు  సినిమా ఆలోచించేవిధంగా వుండాలి అని న‌మ్ముతాను. అలాంటి క‌థ మా ‘శ్రీర‌స్తు శుభ‌మస్తు.ఈ చిత్రం లో ప్ర‌తి ఓక్క కేర‌క్ట‌ర్ మ‌రో కేర‌క్ట‌ర్ కి రిలేటెడ్ గా వుంటుంది. చిన్న కేర‌క్ట‌ర్ కి కూడా వ్యాల్యూ వుంటుంది. ఓక సీనియ‌ర్ న‌టుల‌తో న‌టిస్తే మ‌న‌లోని కాన్ఫిడేన్స్ లెవెల్ బెట‌ర్ అవుతుంది, అదే ఈ చిత్రంలో రావు ర‌మేష్ గారికి నాకు మ‌ద్య వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశంలో కానివ్వండి, ఇంకా ఇత‌ర పాత్ర‌ల‌తో న‌టించిన‌ప్పుడు కానివ్వండి. స్క్రీన్ మీద‌ తెలుస్తుంది.  లావ‌ణ్య తొ సీన్స్ చాలా నేచుర‌ల్ గా వుంటాయి. కుర్రాళ్ళు విజిల్స్ వేస్తారు.  ప్ర‌కాష్‌రాజ్‌, రావుర‌మేష్‌, సుమల‌త‌, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, , రవి ప్రకాష్, రణధీర్,  హంసానందిని, సుమిత్ర లాంటి న‌టీన‌టుల‌తో ఈ చిత్రం చేస్తున్నాము. అంద‌రూ చ‌క్క‌టి ఫ్యామిలి మెంబ‌ర్స్ లా ఇమిడారు.  కాశ్మీర్ లో చాలా అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ చేశాము.  ఈ షెడ్యూల్ తో షూట్ కంప్లీట్ అయ్యింది. అని అన్నారు
నిర్మాత అల్లు అర‌వింద్ గారు మాట్లాడుతూ ..  మా చిత్రం ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చివ‌రి షెడ్యూల్ కాశ్మీర్ లో జ‌ర‌పుకున్నాము. దాదాపు షూటింగ్ పూర్త‌య్యింది. శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. చక్క‌టి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా స‌మ్మ‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌రైనోడు చిత్రం త‌రువాత మా బ్యాన‌ర్ లో వ‌స్తున్న చిత్ర‌మిది.. ద‌ర్శ‌కుడు బుజ్జి చాలా మంచి చిత్రాన్ని తీసాడు. ఇప్ప‌టికే పాజిటివ్ బ‌జ్ వున్న ఈ చిత్రంలో న‌టీన‌టులంద‌రూ చాలా బాగా న‌టించారు. థ‌మ‌న్ అందించిన ఆడియో సినిమాకి ప్ల‌స్ అవుతుంది. అతి త్వ‌ర‌లో, ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని, ఆడియో ని ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువ‌స్తాము. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాము. “అని అన్నారు.
న‌టీన‌టులు..
అల్లు శిరిష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత,రావురమేష్, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి,  రవి ప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర త‌దిత‌రులు న‌టించారు..
శ్రీరస్తు శుభమస్తు
గీతా ఆర్ట్స్ బ్యానర్‌
సంగీతం – తమన్.య‌స్‌.య‌స్‌
యాక్షన్ – రామ్, లక్ష్మణ్
ఆర్ట్ – రామాంజనేయులు
డిఓపి – మని కంతన్
పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- నాగ‌రాజు
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాత – అల్లు అరవింద్
To Top

Send this to a friend