శ్రీవారికి చేయిస్తిమీ.. బంగారు కానుకలు..

తెలంగాణ వస్తే బంగారం ఆభరణాలు చేయిస్తానని కేసీఆర్ మొక్కుకున్నాడు. యాదాద్రి , తిరుమల, వరంగల్ భద్రకాళికి కోర్కెలు కోరాడు. ఇప్పుడు ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు. గతంలో వరంగల్ భద్రకాళి అమ్మవారిని 11.7 కిలోల బంగారు కిరీటాన్ని కేసీఆర్ సమర్పించారు. దసరా సందర్భంగా కేసీఆర్ సతీసమేతంగా వరంగల్ కు చేరుకొని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి ఈ బంగారు కిరీటం ఇతర ఆభరణాలను సమర్పించారు.

సుమారు 3 కోట్ల విలువైన ఈ అభరణాలను జీఆర్టీ జ్యూవెల్లర్స్ ప్రత్యేకంగా తయారు చేశారు. డిజైన్ సలహాలు, సూచనలు అందించిన కేసీఆర్ వాటిని దగ్గరుండి చేయించారు. తెలంగాణ సిద్దించడంతో మొదట భద్రకాళికి తన మొక్కు తీర్చుకున్నారు కేసీఆర్..

ఇప్పుడు తిరుపతి వెంకన్న మొక్కు తీర్చుకోవాలని యోచిస్తున్నాడు.. అందులో భాగంగా కోయంబత్తూరులో తయారు చేస్తున్నారు. దాదాపు 19 కిలోల బంగారాన్ని ఉపయోగించి రూ.5.59 కోట్లతో శ్రీవారికి సాలగ్రామహారం, పేటల కంఠాభరణం తయారుచేయించారు. అయితే ఈ ఆభరణాల తయారీని తెలంగాణ ప్రభుత్వం టీటీడీకి అప్పగించింది. స్వామీ వారికి వీటిని అలంకరిస్తారు. అందుకే టీటీడీయే పర్యవేక్షిస్తోంది.. టెండర్లు ఆహ్వానించగా కీర్తిలాల్ కాళిదాస్ కంపెనీ దక్కించుకొని పూర్తి చేసింది.. ఈనెల 31న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల వెళ్లి మొక్కిన మొక్కులు తీర్చుకోనున్నారు.

To Top

Send this to a friend