శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి U/A సర్టిఫికెట్

 

srirastu-subhamastu00002
అల్లు శిరీష్‌,  లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, పరుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కత్వంలో అల్లు అర‌వింద్ నిర్మాత‌గా,  ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం  ‘శ్రీరస్తు శుభ‌మ‌స్తు’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందించారని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ చిత్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈనెల 31న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా జరగనుంది. ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా
చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ… శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి సంబంధించిన పాటలు, ట్రైలర్ ఇటీవలే విడుదల చేశాం. చాలా మంచి స్పందన లభించింది. తమన్ అద్భుతమైన పాటలందించాడు. చిత్ర టైటిల్ కు తగ్గట్టుగా అందరు సూపర్ హిట్ ప్రాప్తిరస్తు అని అభినందిస్తున్నారు. చిత్ర సెన్సార్ పూర్తై యు బై ఏ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈనెల 31న నిర్వహించనున్నాం. ఈకార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై… అల్లు శిరీష్  తో పాటు చిత్ర యూనిట్ ను ఆశీర్వదించనున్నారు. అని అన్నారు.
            అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత,  సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్.య‌స్‌.య‌స్‌, యాక్షన్ – రామ్, లక్ష్మణ్,
ఆర్ట్ – రామాంజనేయులు, డిఓపి – మని కంఠన్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- నాగ‌రాజు, ఎడిటర్ – మార్తాడ్ కె.వెంకటేష్, నిర్మాత – అల్లు అరవింద్, దర్శకుడు – పరశురామ్.
To Top

Send this to a friend