శృంగార సీన్లలో రెచ్చిపోయిన కంగనారౌనత్

ఈ మధ్య బాలీవుడ్ తార కంగనా రౌనత్ డోస్ పెంచింది. తన లేటెస్ట్ మూవీ రంగూన్ లో శృంగారాన్ని ఒలకబోసింది. బట్టలేకుండా హీరో షాహిద్ తో కంగనా చేసిన రోమాన్స్ చూసి కుర్రకారు షేక్ అవుతోంది.. ఇంత బహిరంగంగా బోల్డ్ సన్నివేశాల్లో నటించిన కంగనాను విలేకరులు ఇదే విషయంపై ప్రశ్నిస్తే చాలా లైట్ గా తీసుకోండని ఉచిత సలహాలిచ్చిందట..

రంగూన్ సినిమా 1945 లో యుద్ధ నేపథ్యంలోనే తెరకెక్కింది.. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ తో పాటు కంగనా ప్రధాన హీరోయిన్ గా నటించింది. కథ విషయానికి వస్తే యుద్ధం ఎంత ఉందో శృంగారం అదే స్తాయిలో ఉంది. ఇలాంటి సీరియస్ సినిమాలో శృంగార సీన్లు అవసరమా అని కంగనను విలేకరులు ప్రశ్నిస్తే.. ‘యుద్ధ సినిమాలోశృంగార సన్నివేశాలు అవసరమే.. నిజానికి యుద్ధంలో కూడా శృంగారం అనేది ఓ కళే.. నా ఉద్దేశం ప్రకారం యుద్ధంలో శృంగారం కూడా ఓ భాగమేనని’ గడుసుగా సమాధానమిచ్చింది ఈ అమ్మడు.. మరి ఈ సినిమా విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి..

రంగూన్ సినిమాలో కంగనా రోమాన్స్ సీన్లను, ట్రైలర్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend