శాతకర్ణి హిట్టే.. మొదటి 15 నిమిషాలు కేకనట..

చిరంజీవి ఖైదీనంబర్ 150 వ సినిమా భారీ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి బాలక్రిష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి మూవీపైనే పడింది.. భారత దేశాన్ని ఐక్యం చేసి పాలించిన గొప్ప రాజు కథను తన 100 వ చిత్రంగా ఎన్నుకొని బాలయ్య గ్రాండ్ భారీ బడ్జెట్ తో సినిమాను తీశారు. డైరెక్టర్ క్రిష్ అద్భుతంగా విదేశాల్లో తీసిన వార్ సీన్లు, సినిమా ఆసాంతం ప్రేక్షకులను కట్టిపడేస్తోందట..  సినిమా మొదలైన మొదటి 15 నిమిషాలు.. అటు అభిమానులను, ఇటు సాధారణ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేస్తోందట.. హీరో ఇంట్రడక్షన్ సీన్, ఫైట్ లు అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు..

శాతకర్ణి సినిమా స్టోరీ, కథనం , బుర్రా సాయిమాధవ్ సంభాషణలు, క్రిష్ టేకింగ్, డైరెక్షన్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయని.. శాతకర్ణి రోల్ బాలక్రిష్ణ ఒదిగిపోయాడని ప్రేక్షకులు చెబుతున్నారు. జార్జియా, మొరాకోలో తెరకెక్కించిన యుద్ధసన్నివేశాలను ప్రేక్షకులను మునివేళ్లపై చూసేలా చేస్తున్నాయని చెబుతున్నారు. పాటలు కొంచెం వీక్ గా ఉన్నాయని.. అయితే రాజుల కాలం నాటి స్టోరీ భావోద్వేగాలు మరింత బలాన్నిచ్చాయని చెబుతున్నారు.. విజువల్ ఎఫెక్ట్ అద్భుతంగా ఉన్నాయని.. సినిమా చేసిన జనం చెబుతున్నారు..

సంక్రాంతి బరిలో చిరు ఖైదీ, బాలయ్య శాతకర్ణి మూవీ రెండు బరిలో ఉండడంతో ఏ సినిమా హిట్ అవుతుందోనన్న ఉత్కంఠ ఉండేది.. కానీ చిరు 150 సినిమా గ్రాండ్ హిట్ కాగా.. బాలయ్య శాతకర్ణి మూవీ కూడా అదే హిట్ బాటలో నడుస్తోంది… చిరు సినిమాతో పోల్చితే శాతకర్ణి మూవీకి థియేటర్ల కొరత ఏర్పడ్డా హిట్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఏర్పడింది.. మొత్తం తెలుగు అగ్రహీరోలిద్దరి సినిమాలు విజయవంతం కావడంతో ఇటు ప్రేక్షకులు, అటు థియేటర్లు కళకళలాడుతున్నాయి..

To Top

Send this to a friend