శాతకర్ణి టీంపై ఐటీ దాడులు..!

గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ నిర్మాతలు, పంపిణీదారులపై ఐటీ దాడులు జరిగినట్టు ఐటీ అధికారులు తెలిపారు. డైరెక్టర్ క్రిష్, నిర్మాత వై రాజీవ్ రెడ్డిల ఇళ్లు, ఆపీసులపై మంగళవారం ఈ దాడులు జరిగినట్టు తెలిపారు. సినిమాకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడే కాక నిర్మాత కూడా.. క్రిష్ సొంత నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ సినిమా నిర్మించారు. అంతేకాకుండా శాతకర్ణి తెలంగాణ హక్కులు పొందిన హీరో నితిన్ తండ్రి, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు చేసినట్టు సమాచారం.

శాతకర్ణి మరో నిర్మాత బెబో శ్రీనివాస్ , క్రిష్ కలిసి ఈ సినిమాను 45 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా విజయవంతమై దిగ్విజయంగా వసూళ్లు సాధిస్తోంది. కానీ చిత్రం యూనిట్ ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన వసూళ్లు, రాబడులు వెల్లడించలేదు. దీంతో ఐటీ అధికారులు వీరి ఇళ్లపై దాడులు చేసి శాతకర్ణి టీం నుంచి రావాల్సిన ఆదాయపు పన్నును గురించి ఆరాతీసినట్టు సమాచారం.

To Top

Send this to a friend