శాతకర్ణిలో అది లేదని ఒప్పుకున్న బాలయ్య..

అందరూ అంటున్న నిజాన్ని ఎట్టకేలకు బాలయ్య ఒప్పేసుకున్నాడు.. బాలక్రిష్ణ ప్రతిష్టాత్మకంగా తీసిన ఆయన వందో చిత్రం సంక్రాంతికి విడుదలై విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే క్రిష్, బాలయ్య సినిమాపై రకరకాలు కామెంట్లు వినపడుతున్నాయి. చాలా తక్కువ రోజుల్లో సినిమాను తీశాడని.. బాలీవుడ్, హాలీవుడ్ వార్ సీన్లు కాపీ మార్చి వాడుకున్నాడని.. కథను తక్కువ చూపించి యుద్ధ సన్నివేశాలనే హైలెట్ చేశాడని.. క్రిష్ మార్క్ కథ, డ్రామా లేవనే ప్రచారం సాగింది..

కాగా ఇదే విషయాన్ని మంగళవారం హైదరాబాద్ లో బాలయ్య అంగీకరించారు. ‘‘ గౌతమి పుత్ర శాతకర్ణి లో గొప్ప కథ లేదన్నది వాస్తవమే.. చరిత్రలోని సంఘటనల్ని విస్మరించాం.. అయినప్పటికీ ఉన్నంతలో శాతకర్ణి గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాం. ఇలాంటి చారిత్రక నేపథ్యంతో మరో చేయమని జనాలు అడుగుతున్నారు. సరైన స్ర్కిప్ట్ వస్తే తప్పకుండా చేస్తాను’’ అని బాలయ్య విలేకరుల ముందు నిజం ఒప్పేసుకున్నారు..

To Top

Send this to a friend