శశి తీర్పుతో జగన్ భవితవ్యం ఏంటి.?

తమిళనాట ఉద్రిక్త పరిస్థితులు చల్లారాయి. శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు పోవడంతో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శశికళ వర్గం నేత పళనిస్వామిని గవర్నర్ సీఎం పదవి చేపట్టడానికి పిలవడంతో వివాదం సద్దు మణిగినట్టే.. కాగా తమిళనాట రాజకీయ పరిణామాలు ఏపీలోనూ కాక పుట్టిస్తున్నాయి.. శశికళ జైలుకు వెళ్లాల్సి రావటంతో జగన్ పరిస్థితి ఎలా ఉండబోతుందన్న దానిపైనా ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై టీడీపీ అధినేత స్పందించారు. శశికళకు పట్టిన గతే వైసీపీ అధినేత జగన్ కు పడుతుందని స్పష్టం చేశారు. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ చెంగల్రాయుడు సభలో చంద్రబాబు జగన్ పై మండిపడ్డారు. శశికళకు ఎన్నో రెట్లు అవినీతికి పాల్పడ్డ చరిత్ర జగన్ ది అన్నారు. ఆయన కూడా త్వరలోనే జైలుకెళ్లక తప్పదు అని స్పష్టం చేశారు.

అదే పట్టుదల ఎటుపోతుందో..
శశికళది.. వైఎస్ జగన్ ది ఒకటే లక్ష్యం.. ఇద్దరూ సీఎం కావాలని కోరుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి సీఎం కావడమే లక్ష్యంగా జగన్ శ్రమిస్తున్నాడు. అయితే దేశంలో ఎందరో ప్రాంతీయ పార్టీల నాయకుల్లాగానే జగన్ కూడా అక్రమాస్తుల కేసును ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఆయన 16 నెలలు జైలు జీవితం గడిపి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షసాధింపుతో కేసులు బనాయించిందని జగన్ ఆరోపించాడు.

మోడీతో జగన్ ఢీ
చిన్నమ్మ కథ ఇప్పుడు కర్ణాటక జైలుకు చేరింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ప్రత్యేక హోదా కోసం పోరాడడం వంటి చర్యలతో జగన్ కూడా మోడీని ఢీ అంటున్నాడు. ఇప్పుడు శశికళను ముప్పుతిప్పలు పెట్టిన మోడీజీ జగన్ పై కూడా కన్నేస్తే ఆయనకు కూడా జైలే గతి తప్పదు. ఇటీవలే అక్రమాస్తుల కేసులో ఎటాచ్ అయిన జగన్ కంపెనీలు, సాక్షి ఆఫీసు, లోటస్ పాండ్ ఇల్లు తదితరాలు స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతమవుతుండడం కూడా జగన్ శిభిరాన్ని కలవరపెడుతోంది..

తాజాగా ఈడీ.. జగన్ నివాసంతో పాటు సాక్షి పేపర్ ఆఫీస్‌ను, ఆయనకు చెందిన ఇతర కీలక ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు జారీ చేసింది. అది కూడా కేవలం 10 రోజుల వ్యవధిలో తమ స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొంది. ఈ పరిణామాలు జగన్‌కు వ్యక్తిగతంగానే కాదు.. రాజకీయంగా కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది.శశికళ లాగే అక్రమాస్తుల కేసుల్లో గనుక కోర్టు జగన్‌కు శిక్ష విధిస్తే ముఖ్యమంత్రి పదవికి జగన్ దూరం కావాల్సిందే.

To Top

Send this to a friend