శశికళ జైలుకు.. ఆ స్థానంలోకి పళనిస్వామి


తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనుకున్న శశికళ ఆశలు గల్లంతయ్యాయి. సుప్రీంకోర్టు అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. సుప్రీం తీర్పుతో శశికళ నైరాష్యంలో మునిగిపోయింది. తనకు బదులు పార్టీ ముఖ్యనేత పళనిసామిని శశికళ శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేశారు. గోల్డెన్ బే రిసార్ట్ లో సమావేశమైన శశికళ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ మేరకు పళని స్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.
సుప్రీం శశికళకు నాలుగేళ్ల జైలు, 10 కోట్ల జరిమానా విధించింది. అంతేకాదు వెంటనే బెంగళూరు ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని తీర్పులో స్పష్టం చేసింది. దీంతో తనకు సీఎంగా పీఠం దక్కకపోయినా సరే తన ముఖ్య అనుచరుడైన పళనిసామినికి పగ్గాలు అప్పగించేలా ఆయన్ను శాసనసభాపక్ష నేతను చేశారామే.. దీంతో పళనిస్వామి తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి కోరనున్నారు. ఇప్పటికే ఆయన తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు పంపించారు

To Top

Send this to a friend