శశికళ వార్నింగ్ కు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు అదరడం లేదు.. బెదరడం లేదు.. పైగా తనను హెచ్చరికలతో ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. ‘తనకు 129 మంది ఎమ్మెల్యేల మద్దుతున్నా గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు పిలవడం లేదని.. తేడా వస్తే రాజ్ భవన్ ముందు నిరాహార దీక్షకు వెనుకాడనని శశికళ బెదిరించిన సంగతి తెలిసిందే.. దీనిపై గవర్నర్ దృష్టికి రావడంతో ఆయన దీటైన సమాధానం ఇచ్చినట్టు తెలిసింది..
‘‘నిరాహార దీక్షల పేరు తో శశికళ బెదిరింపులకు భయపడేది లేదు. స్థిరమైన ప్రభుత్వాన్ని తమిళనాడులో ఏర్పాటు చేయడం నా విధి. అందుకే ఎదురుచూస్తున్నా.. సుప్రీం కోర్టు రెండు రోజుల్లో అక్రమాస్తుల కేసులో తీర్పునిస్తుంది. తీర్పులో దోషిగా తేలితే శశికళ సీఎం సీటునుకోల్పోయి జైలుకు వెళతారు. అందుకే తనతో భేటికి అవకాశం ఇవ్వలేదు. ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకొని దుందుడుకుగా వ్యవహరిస్తే శశికళేకే నష్టమని’’ విద్యాసాగర్ రావు పేర్కొన్నట్టు తెలిసింది.
ప్రస్తుతం బంతి గవర్నర్ చేతిలో ఉంది. ఆయనతో సానుకూలంగా వ్యవహరిస్తేనే మంచిది. కొంచెం ఓపిక పడితే రాజకీయాలు సర్దుకుంటాయి. కానీ అధికారకాంక్షతో శశికళ గవర్నర్ కే బెదిరింపులు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.దానికి గవర్నర్ అంతే ధీటుగా బదులివ్వడం కూడా తమిళ రాజకీయాలను వేడెక్కించింది..
