వ్యాపారం+రాజకీయం= అమాయకులు బలి


ఈ పాపం ఎవరిదీ..? ధనదాహంతో అమాయకులను బలిగొన్న వ్యాపారులదా.? నిర్లక్ష్యంగా నడిపి ప్రాణాలు తీసిన బస్ డ్రైవర్ దా.. లేక.. వ్యాపారులే రాజకీయ నాయకులుగా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నా చోద్యం చూస్తున్న ఏపీ ప్రభుత్వానిదా.. ఎవరిదీ పాపం.. ఎవరికీ శాపం..

పెళ్లి చూపులకు వెళ్తున్న ఇద్దరు సోదరులు.., కుమార్తెను కాపురానికి తీసుకెళ్తున్న ఓ తల్లి ఇలా ఎందరో దివాకర్ ట్రావెల్స్ బస్సులో కోటి ఆశలతో వెళుతున్నారు. కానీ డబ్బే పరమావధిగా కొసాగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వారి ఆశలు ఆవిరయ్యాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ప్రయాణికులతో వస్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు మంగళవారం ఉదయం 5.45 నిమిషాలకు కృష్ణ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద ఘోర ప్రమాదానికి గురైంది.. బ్రిడ్జి పై నుంచి కింద పడిపోయింది.నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యంతో దాదాపు 10 మంది మృతి చెందారు.. 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

దివాకర్ , కేశినాని ట్రావెల్స్ పేరుతో ఏపీలో దోపిడీ కొనసాగుతోంది. వీరంతా అధికార టీడీపీ పార్టీలో కొనసాగుతున్నారు ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా కొనసాగుతూ అధికార అండదండలతో ఇలాంటి అరాచకాలను కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను అరికట్టింది లేదు.. తెలంగాణలో ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఉద్యమంతో తెలంగాణ ప్రభుత్వం ట్రావెల్స్ పై కొంత నియంత్రణ విధించింది. కానీ ఏపీలో మాత్రం ఎంతమంది ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తు ఈ మారణహోమం సృష్టిస్తూనే ఉంది..

మొన్నటికి మొన్న బెంగళూరు నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సజీవ దహనమై 40 మంది వరకు అగ్నికి ఆహుతై పోయారు.. ఆ మధ్యలో బస్సు యాక్సిడెంట్ తో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇప్పుడు దివాకర్ ట్రావెల్స్ నిర్లక్ష్యంతో పది మంది , 33మందికి తీవ్రగాయాలు.. అందులోనూ ఎవరు బతుకుతారో లేదో తెలియదు.. ఇంతటి ఘోరకలిలు కొనసాగుతున్న ఏపీ సీఎం ట్రావెల్స్ యాజమానుల అడుగులకు మడుగులు ఒత్తుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

To Top

Send this to a friend