వైసీపీ పరిస్థితిపై లగడపాటి సర్వే… షాకింగ్ విషయాలు

లగడపాటి రాజగోపాల్. విజయవాడ మాజీ ఎంపీ. ఈయనకు ఆంధ్రా ఆక్టోపస్ అన్న పేరు కూడా ఉంది. ప్రతి ఎన్నికల్లో ఈయన చేయించిన సర్వేలు దాదాపు నిజమతూ వస్తుండడంతో ఆయనకు ఆక్టోపస్ అన్న పేరు వచ్చేసింది. తాజాగా దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో లగడపాటి సర్వే చేయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీలో పరిస్థితులపైనా తన సర్వే అభిప్రాయాలను కొందరు విలేకర్లతో లగడపాటి పంచుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బీజేపీనే గెలుస్తుందని లగడపాటి వెల్లడించారు. నోట్ల రద్దు అంశం బీజేపీకి ఉపయోగపడుతోందన్నారు. అదే సమయంలో సమాజ్‌వాది పార్టీలో కుటుంబ కలహాల కారణంగా ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఏమిటని విలేకర్లు ప్రశ్నించగా… టీడీపీపై ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని లగడపాటి వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బాగా బలపడిందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం వైసీపీ అనుకున్న స్థాయిలో ఆధిక్యత కనబరచలేకపోతోందన్నారు. పట్టణ ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ సమఉజ్జీలుగా ఉన్నాయని లగడపాటి చెప్పారు. కాంగ్రెస్ తిరిగి బలపడుతోందన్న వ్యాఖ్యలను లగడపాటి కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరుగైపోయిందని… కోలుకునే పరిస్థితి కూడా లేదన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున అప్పటికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంటుందన్నారు లగడపాటి.

To Top

Send this to a friend