వైసీపీకి షాక్


ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఆశలు ఆవిరయ్యాయి. వైఎస్ జగన్ సొంత ఇలాఖా కడపలో క్రాస్ ఓటింగ్ జరిగిందని.. వైసీపీదే గెలుపు అని అంతా భావించారు. కానీ చివరకు అదేదీ సాకారం కాలేదు. ఏపీలో జరిగిన 3 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు.

*బాబాయి ఓటమి జగన్ కు దెబ్బే..
అది వైఎస్ జగన్ సొంత ఇలాకా కడప.. పైగా బరిలో ఉంది.. బాబాయి వివేకానందరెడ్డి.. అయిన కూడా జగన్ గెలిపించలేకపోయారు. ఇక్కడ గెలుపు టీడీపీకి కొండంత బలాన్ని ఇచ్చింది. ప్రతిక్షణం ఉత్కంఠగా సాగిన కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై 32 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విజయం సాధించారు.

* ఇక నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డిపై 87 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు.

* కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు. 56ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై చక్రపాణి విజయం సాధించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడం జగన్ కు.. వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. కనీసం ఎంతో పట్టున్న కడపలో కూడా సొంత బాబాయిని జగన్ గెలుపించుకోలేకపోవడం కృంగదీసింది. ముఖ్యంగా కడపలో టీడీపీకి విజయం వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది.

To Top

Send this to a friend