వైసీపీకి దగ్గరగా మహేశ్ ఫ్యామిలీ..

రాజకీయాలు, సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ వేరు కాదు.. ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంటుంది. నాటి ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు వరకు.. నటులు.. రాజకీయ నాయకులుగా.. రాజకీయ నాయకులు నటులుగా పరకాయ ప్రవేశం చేస్తున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్-ఏఎన్నార్ ల తర్వాత కృష్ణ లు దిగ్గజ హీరోలుగా పేరుతెచ్చుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ , ఆయన వారసులు టీడీపీలో ఉండగా.. ఏఏన్నార్ ఫ్యామిలీ, నాగార్జున న్యూట్రల్ గా.. ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీకి సపోర్టుగా నిలుస్తున్నారు. ఇక కృష్ణ మాత్రం ఆదినుంచి టీడీపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. కాంగ్రెస్ కు మద్దతుగానే ఆయన ఉంటున్నారు. కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు ప్రస్తుతం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీలో కొనసాగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఆదిశేషగిరిరావు వైసీపీ కి అమరావతిలో స్థలం లేకపోవడంతో తనకు 7 ఎకరాల్లో 2 ఎకరాలను జగన్ కు ఇచ్చి ఉదారత చాటుకున్నారు. అందులో ఆదివారం శంకుస్తాపన కూడా చేసేశారు. వచ్చే జూన్ వరకు కంప్లీట్ చేయాలని నిర్ణయించారట.. జగన్ హైదరాబాద్ వీడి మొత్తంగా అమరావతినుంచే తన కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించారట.. ఇలా జగన్ పార్టీలో ఉంటూ జగన్ కోరిక మేరకు అమరావతి లాంటి విలువైన చోట స్థలాన్ని ఇచ్చి మహేశ్ బాబాయి ఆదిశేషగిరి రావు వైసీపీలో కీలకంగా మారారు.  వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీచేస్తారనే ప్రచారం ఉంది. అందులో భాగంగానే ఇలా వైసీపీలో కీరోల్ పోషిస్తున్నారు. బాబాయ్ తో పాటు మహేశ్, కృష్ణ కూడా వైసీపీకే దగ్గరగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు..
To Top

Send this to a friend