వైఎస్ జగన్ కు ఈడీ నోటీసులు

వైకాపా అధినేత వైఎస్ జగన్ షాక్ తగిలింది.. ఇటీవలే జగన్ కు చెందిన 750 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఈడీ అన్నంత పని చేసింది.. మనీ లాండరింగ్ చట్టం కింద జగన్ కు చెందిన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని ఇళ్లు, పార్టీ ప్రధాన కార్యాలయం , ఇతర కంపెనీలు ఇక ఈడీ ఆధీనంలో కొనసాగుతాయంటూ గురువారం నోటీసులను జారీ చేసింది.. దీంతో జగన్ ఈ ఆస్తులను బదలాయించడం కానీ.. అమ్మడం కానీ కుదరదు.. దోషిగా తేలితే మొత్తం ఆస్తులను ఈడీ జప్తు చేస్తుంది..
ఈ పరిణామాలు వైసీపీలో , జగన్ లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈడీ కొద్దిరోజుల క్రితమే 750 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెయిల్ పై విడుదలై విచారణలకు హాజరవుతున్నారు. అది కొనసాగుతుండగానే.. ఈడీ అక్రమాస్తులపై కొరఢా ఝలిపించడంతో వైసీపీ శ్రేణులు అవాక్కవుతున్నాయి. జగన్ ఆస్తుల పై నోటీసులు అందుకున్న వాటిల్లో వైఎస్ జగన్ కు చెందిన ఇళ్లు, ఆఫీసుతో పాటు ప్రస్తుతం సాక్షి మీడియా గ్రూపు ఉన్న (పత్రిక, చానల్) భవనం కూడా ఉంది. ఒకవేళ జగన్ కేసు తుది విచారణలో దోషిగా తేలితే ఆయన ఇళ్లు, ఆఫీసుతో పాటు పత్రిక, చానల్ భవనం కూడా జప్తు అవుతుంది. ఈ పరిణామాలు జగన్ కు పెద్ద షాక్ లా మారాయి.

To Top

Send this to a friend