వేర్వేరు ఫార్మట్ లకు వేర్వేరు కెప్టెన్లు సరిపడదు: ధోని

మహేంద్ర సింగ్ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు.. తాను ఎవ్వరి ఒత్తిడితోనే కెప్టెన్సీని వదులుకోలేదని.. తాను బాగా ఆలోచించే భారత క్రికెట్ కు మేలు జరగాలని కెప్టెన్ గా వైదొలగానని స్పష్టం చేశారు. నాయకత్వ బాధ్యతలు కోహ్లీకి అప్పగించడానికి కారణాన్ని వెల్లడించారు. వేర్వేరు ఫార్మట్ లకు వేర్వేరు కెప్టెన్లు అనే విధానం భారత క్రికెట్ కు సరిపడదు.. టెస్టులకు ఒకరు. వన్డేలకు ఒకరు ఉంటే జట్టు నిలబడదు.. అందుకే సూపర్ ఫామ్ లో ఉండి జట్టును ముందుండి నడిపిస్తున్న కోహ్లీకి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడానికి తాను నిర్ణయించాను. అందుకే సారథ్యం వదిలి ఆటగాడిగా కొనసాగడానికి నిర్ణయించుకున్నాను అని ధోనీ వివరించారు..

టెస్టుల్లో నిరూపించుకున్న కోహ్లీ సారథ్యంలో భారత్ మరింత ముందుకు వెళుతుందని.. నాకంటే ఎక్కువ విజయాలు దక్కుతాయని ధోని జోస్యం చెప్పాడు. అన్ని ఫార్మట్లలో రాణిస్తూ చరిత్నను మార్చగల సామర్థ్యం ప్రస్తుతం ఈ జట్టుకు ఉంది.. చాంపియన్స్ ట్రోపీ వరకు ఉన్నా పెద్ద తేడా రాదు.. కోహ్లీ అయితే ఇప్పటినుంచి టోర్ని వరకు జట్టును నడిపి విజేతగా నిలపగలడు.. అని ధోని కోహ్లీపై విశ్వాసం వ్యక్తం చేశాడు..

To Top

Send this to a friend