వెయ్యినోటు వచ్చేస్తోంది..

ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్లు రూ.1000, రూ.500 రద్దు చేసి ఒక్క రూ.500 కొత్తనోటునే ప్రవేశపెట్టారు. దానికంటే ముందు 2వేల నోటును తెచ్చారు. మరి చిల్లర సమస్య నెలకొనడంతో 500 నోట్లనే ఎక్కువగా జనబాహుల్యంలోకి తెచ్చారు. ఇంతకీ రద్దైన 1000 నోటు స్థానంలో కొత్తనోటు ఎప్పుడు తెస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అందుకే దీన్ని తెరదించుతూ అతి త్వరలోనే కొత్త సీరిస్ వెయ్యినోట్లను ప్రవేశపెట్టేందుకు భారత రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆర్బీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ప్రధాని మోడీ రద్దు చేసిన 15.44 లక్షల పెద్ద నోట్లు ఆర్బీఐకి చేరాయి. వాటి స్థానంలో 500 నోటు వచ్చింది. 1000 నోట్లను ప్రస్తుతం ముద్రిస్తున్నారట.. చిల్లర సమస్యతో మొదట 500 నోటును రిలీజ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు 1000 నోటును తెచ్చేందుకు ప్రింటింగ్ మొదలు పెట్టిందని సమాచారం. గత జనవరిలోనే 1000 నోటు వస్తుందని ఆశించినా జాప్యంతో రాలేదు. దీంతో ఎప్పుడు వస్తుందనేదానికి తెరదించుతూ వచ్చే నెలలో 1000 నోటు రిలీజ్ కానుందని అధికారులు తెలిపారు.

To Top

Send this to a friend