వెటకారం.. ఉప్పుకారం.. నారా చంద్రుడిపై ప్రతీకారం..

jana-kcr-ktr-cbn

ఈ టీఆర్ఎస్ వోళ్లు ఉన్నారే.. ఎక్కడికెళ్లినా అక్కడకే వచ్చి ఆగుతున్నారు.. ఏంటో మా నారా చంద్రుడిని ఆడిపోసుకున్నారు.. రాష్ట్రాలుగా విడిపోయినా మా చంద్రుడే బలి అయిపోతున్నాడు.. ఆయన చేసింది టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ మరిచిపోలేదనుకుంటా.. అందుకే ప్రతి శాసనసభలో ఏపీసీఎంపై ఏదో పంచ్ వేయనిదే నిద్రపట్టట్లేదు వారికి..
తెలంగాణ శాసనసభలో ఆసక్తికర సంవాదం సోమవారం చోటుచేసుకుంది.. టీఎస్ ఐపాస్ పై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ తోవలో నడిచాడు.. కాస్త గ్రాంథికం.. కవిత్వం జోడించి ప్రభుత్వ పారిశ్రామిక ధోరణిలో పేర్కొన్నాడు.. ‘పున్నమి చంద్రుడు, వెన్నెల ను చూసి ఆనందపడతారు.. కొందరు చంద్రుడిలో మచ్చలు వెతుకుతారు.. మండలి సభ్యులు మెచ్చుకున్న ప్రభుత్వాన్ని శాసనసభలో ఎవరూ ఒప్పుకోవడం లేదంటూ కవితాత్మక ధోరణిలో తెలిపారు. దీనికి కౌంటర్ ఇచ్చిన జానారెడ్డి.. ‘మీ పున్నమి చంద్రుడిలో వెలుగు ఉందో లేదో తెలియదు.. చంద్రుడిలోని మచ్చలు మాత్రమే మేం విమర్శిస్తున్నాం.. ‘‘ అంటూ సెలవిచ్చారు.. దీనికి కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేతలు అసలు చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు.. మీ కేసీఆర్ అలాంటివారేనని విమర్శించారు.
వీటిన్నింటిని విన్న కేటీఆర్ చంద్రబాబును బేస్ చేసుకొని చేసిన విమర్శ సభలో ఆద్యంతం ఆకట్టుకుంది.. ‘‘ మేం మాట్లాడుతోంది.. మీ (టీడీపీ) వెన్నుపోటు చంద్రుడి గురించి కాదు.. మా చంద్రుడి(కేసీఆర్ ) గురించి..‘‘ అంటూ రక్తికట్టించడంతో సభ ఆద్యంతం నవ్వులు పూసింది..
ఏది ఏమైనా అనుకోండి పాతగాయాల్ని మళ్లి రేపి మా నారా చంద్రుడిని ఆడిపోసుకోవడం అవసరమా అంటూ టీడీపీ నేతలు అసెంబ్లీ లాబీలో బాధపడిపోవడం సోమవారం తెలంగాణ అసెంబ్లీలో కనిపించింది.. చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతలు అంత త్వరగా మరిచిపోయి సామరస్య స్నేహభావాన్ని పాటించే పరిస్థితిలోనైతే ఇప్పట్లో లేరు..

To Top

Send this to a friend