వీరూ..   నువ్ సూపరెహే..


వీరేంద్ర సెహ్వాగ్ ఏదీ చేసినా సంచలనమే.. బ్యాట్ తో గతంలో ఇరగదీసినా.. ట్విట్టర్ లో మాటల తూటాలు పేల్చినా అది సంచలనంగానే మారుతోంది.. ఆదివారం ట్విట్టర్ వేదికగా వీరేంద్రసెహ్వాగ్ చేసిన ట్వీట్ అందిరి నోట్లలో నానింది. పంచ్ కి పంచ్ లా ఇచ్చిన ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది..
ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణిదీప్ సింగ్ కుమార్తె గుర్ మెహర్ కౌర్ ఒక పోస్టింగ్ చేసింది. అందులో ఓ పోస్టర్ ను పట్టుకొని ఫొటోను ట్విట్టర్ లో ఉంచింది. అందులో తన తండ్రిని పాకిస్తాన్ చంపలేదు.. కార్గిల్ యుద్ధం చంపేసింది అంటూ ట్వీట్ చేసింది గుర్ మెహర్.. ఇది దుమారం రేపింది.అందరినోట నానింది..
దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సెహ్వాగ్ సేమ్ అమ్మాయి చేసినట్టే ఒక పోస్టర్ ను పట్టుకొని ఫొటో విడుదల చేశారు. అందులో తాను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదని.. కేవలం తన బ్యాటే చేసిందని రాసుకొచ్చారు. ఇప్పుడు సెహ్వాగ్ ట్వీట్, అమ్మాయి ట్వీట్ కు కౌంటర్ అని.. ఆమెకు దిమ్మదిరిగే లా సమాధానం సెహ్వాగ్ ఇచ్చారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

To Top

Send this to a friend