‘విన్నర్’ లో సింగం సుజాత సందడి 

లౌక్యం – బాయిలింగ్ స్టార్ బబ్లూ
బెంగాల్ టైగర్ – ఫ్యూచర్ స్టార్ సిద్దప్ప
జక్కన్న – కటకటాల కట్టప్ప
బాబు బంగారం – బత్తాయి బాబ్జీ

ఈ మధ్య కాలంలో కమెడియన్ పృథ్వీ హిలేరియస్ గా నవ్వించిన కొన్ని పాత్రలివి. వరుసగా తనదైన కమెడీతో… తనదైన డైలాగ్స్ తో… తనదైన పంచులతో… కడుపుబ్బ నవ్విస్తున్న హాస్యనటుడు పృథ్వీ… విన్నర్ చిత్రంలోనూ మరో అరుదైన పాత్రలో నవ్వించబోతున్నారు. అదే సింగం సుజాత. పృథ్వీ కోసం దర్శకుడు గోపిచంద్ మలినేని మరో అద్భుతమైన కామెడీ పాత్రను సృష్టించారు. సింగం సుజాత పాత్రలో పృథ్వి ఒదిగిపోయారు. సింగం సిరీస్ లోని రీ రికార్డింగ్ నే ఈ పాత్రకోసం ఉపయోగించడం విశేషం. విన్నర్ చిత్రంలో పృథ్వి క్యారెక్టర్ తప్పకుండా హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రత్యేకంగా చెబుతోంది.

సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘విన్నర్’. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధుఈ చిత్రాన్నినిర్మించారు. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది.

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల‌ కిశోర్ త‌దిత‌రులుఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఆర్ట్: ప్ర‌కాష్‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌,మాట‌లు: అబ్బూరి ర‌వి, నృత్యాలు: రాజు సుంద‌రం, శేఖ‌ర్‌, ఫైట్స్: స్ట‌న్ శివ‌, ర‌వివ‌ర్మ‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్ రాజు, స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:గోపీచంద్ మ‌లినేని.

To Top

Send this to a friend