విద్యార్థి హాల్ టికెట్ ఫొటో నగ్నంగా!!

 

బీహార్ లో ఏదైనా సాధ్యమే.. అక్కడ అరాచకం ఎక్కువే.. కామన్ సెన్స్ తక్కువే.. అందుకే ఏదీ చేసినా బయటివారికి అది సంచలనంగా ఉంటుందే తప్ప.. ఆ రాష్ట్రంలోని వారికి అది అంతా కామనే.. బిహార్ లోని పరీక్షల బోర్డు అతిపెద్ద తప్పు చేసింది.. ఓ విద్యార్థి హాల్ టికెట్ లో ఆ విద్యార్థిని ఫొటోకు బదులు.. టాప్ హీరోయిన్ టాప్ లెస్ ఫొటో ముద్రించింది.. ఈ వార్తను హిందీ దినపత్రిక ప్రభాత్ బ్యానర్ గా చేయడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపింది..

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈనెల 8న ఎస్ఎస్సీ ఇంటర్ లెవల్ పరీక్షల హాల్ టికెట్లను జారీ చేసింది. ఇందులో హాల్ టికెట్ తీసుకున్న విద్యార్థి ఫొటో చూసుకొని షాక్ అయ్యింది.. ఆ హాల్ టికెట్లో తన ఫొటోకు బదులు బట్టలేకున్నా ఉన్న హీరోయిన్ ఫొటో ఉండడం ఆమెను నివ్వెరపరిచింది.. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులను ఆశ్రయించింది..

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పొరుపాటు వల్ల ఈ టాప్ లెస్ ఫొటో ఉన్న హాల్ టికెట్ జారీ అయ్యింది.. ఫిబ్రవరి 26న విద్యార్థికి పరీక్ష ఉందట.. ఈలోగా ఇది అనోట సోషల్ మీడియాలో రావడంతో వార్త సంచలనం గా మారింది. ఆ విద్యార్థి ఆ హాల్ టికెట్ తో వెళ్లలేక బాధపడుతోందట.. విషయం తెలుసుకున్న పత్రిక ప్రముఖంగా ప్రస్తావించడంతో బీహార్ పరీక్షల బోర్డు పరువు గంగలో కలిసిపోయింది..

To Top

Send this to a friend