విజయ్ దేవరకొండ తాజా చిత్రం “ద్వారక”.

“పెళ్లిచూపులు”తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం “ద్వారక”. విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు. “లెజెండ్ సినిమా” బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు నిర్మాతలు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్న ఈ చిత్రం
ఆడియో విడుదలతోపాటు సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకొంది. మార్చి 3న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర మాట్లాడుతూ.. “క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “ద్వారక” ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దొంగ స్వామిజీగా విజయ్ దేవరకొండ నటన, పూజా ఝావేరి గ్లామర్, వైవిధ్యమైన కథ-కథనాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. విడుదలైన పాటలతోపాటు.. ట్రైలర్ కి కూడా మంచి ఆదరణ లభించింది. సినిమాకి కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది. మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు.
పృథ్విరాజ్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, సురేఖావాని, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, నిర్మాతలు: ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు, దర్శకత్వం: శ్రీనివాస్ రవీంద్ర!

To Top

Send this to a friend